ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.25 వేల డిస్కౌంట్, రూ.10 వేల క్యాష్ బ్యాక్

First Published | Oct 10, 2024, 9:58 AM IST

మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. దసరా సందర్భంగా ధరలు భారీగా తగ్గిస్తూ అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాబ్ వంటి దిగ్గజ కంపెనీలు దసరా సందర్భంగా వాటి వాహనాల సేల్స్ పెంచేలా అనేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పుడు ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఒకటి అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.25 వేల డిస్కౌంట్, రూ.10 వేల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఆ కంపెనీ వివరాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇస్తున్న ఆఫర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 

కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తున్నఏథర్ ఎనర్జీ కంపెనీ తన 450X మరియు 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 25,000 విలువైన ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్‌లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీలో పాటు క్యాష్‌బ్యాక్, ఉచిత ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్‌లలో డిస్కౌంట్‌లు, పొడిగించిన బ్యాటరీ వారంటీ, క్యాష్‌బ్యాక్, ఈథర్ గ్రిడ్‌లో ఉచిత ఛార్జింగ్ ఫెసిలిటీలు ఉన్నాయి. మీరు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తే మీకు రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ భారత ఆటో మార్కెట్లో ఏథర్ ఎనర్జీ ప్రత్యేక మార్కును సంపాదించింది.
 

ఏథర్ ఎనర్జీ 450X, 450 అపెక్స్‌పై రూ. 25,000 విలువైన పండుగ ఆఫర్‌లను ప్రకటించింది. ప్రో ప్యాక్ యాక్సెసరీతో రెండు స్కూటర్‌లలో దేనినైనా కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం అదనపు ఛార్జీ లేకుండా బ్యాటరీపై 8 సంవత్సరాల పొడిగించిన వారంటీని ఈ కంపెనీ అందిస్తోంది. ఏథర్ గ్రిడ్‌పై ఒక సంవత్సరం పాటు ఉచిత ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా రూ. 5,000 వరకు ఆదా అవుతుంది. అంతేకాకుండా స్కూటర్ కొనుగోలుపై అదనంగా రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది. ఇవి కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
 


Ather 450X 2.9kWh, 3.7kWh బ్యాటరీ సామర్థ్యంతో రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 111 కి.మీ, రెండోది 150 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఈ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఆల్-LED లైటింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐదు రైడింగ్ మోడ్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. స్మార్ట్ ఎకోలో ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ ఫీచర్‌లు ఉన్నాయి.
 

Ather Electric Bikes

Ather 450 Apex EV తయారీదారుల లైనప్‌లో అత్యంత ప్రీమియం స్కూటర్. దీని గరిష్ట వేగం 100 kmph, 40 kmph యాక్సిలరేషన్ తీసుకోవడానికి 2.9 సెకన్లు తీసుకుంటుంది. 7kW గరిష్ట పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంది. అపెక్స్ అన్నిLED లైట్లు, పారదర్శక బాడీ ప్యానెల్లు, ఇండియమ్ బ్లూ పెయింట్ అద్భుతమైన లుక్ ఇస్తాయి. ఇది Ola S1 ప్రో, TVS X, సింపుల్ వన్‌తో పోటీపడుతుంది.

ఈథర్ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో మూడు నుండి నాలుగు ఆఫర్‌లను కలిగి ఉంది. అవి 450S, 450X, 450 అపెక్స్, రిజ్టా. ఈ నాలుగింటిలో రిస్టా ఏథర్ నుండి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
 

Latest Videos

click me!