రిలయన్స్ జోరు: 100 బిలియన్ డాలర్లకు చేరువలో ముకేష్ అంబానీ సంపద..

Ashok Kumar   | Asianet News
Published : Sep 04, 2021, 06:31 PM IST

ఆసియా  అత్యంత సంపన్నుడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద 100 బిలియన్ డాలర్లకు అంటే 10 వేల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ షేర్ల పెరుగుదల కారణంగా ముకేష్ అంబానీ నికర విలువ 3.71 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ .27081 కోట్లకు పెరిగింది. 

PREV
15
రిలయన్స్ జోరు: 100 బిలియన్ డాలర్లకు చేరువలో ముకేష్ అంబానీ సంపద..

ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ముకేష్ అంబానీ నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతను ఇప్పుడు 92.6 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ 12వ స్థానంలో ఉన్నాడు.  మరోవైపు రిలయన్స్ స్టాక్ షేర్లు శుక్రవారం అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బి‌ఎస్‌ఈ) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 94.60 పాయింట్లు అంటే 4.12 శాతం జంప్‌తో 2388.25 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ పొజిషన్) రూ .15,14,017.50 కోట్లుగా ఉంది.

25
షేర్లు ఎందుకు పెరిగాయి?

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL), రిలయన్స్ గ్రూప్ కంపెనీ జస్ట్ డయల్ లిమిటెడ్ ని నియంత్రణలోకి తీసుకుంది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం కంపెనీని నియంత్రించడానికి ఈ కంపెనీలో అవసరమైన వాటాను ఆర్‌ఆర్‌వి‌ఎల్ కొనుగోలు చేసింది. 

35

 జస్ట్ డయల్‌లో ఆర్‌ఆర్‌విఎల్‌కు 40.98 శాతం వాటా ఉంది. ఆర్‌ఆర్‌విఎల్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, జూలై 20న ఆర్‌ఆర్‌విఎల్ 1.31 కోట్ల షేర్లను  ఒక్కో షేరుకు రూ. 1020 చొప్పున జస్ట్ డయల్ కొనుగోలు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్లాక్ విండో సౌకర్యం కింద వి‌ఎస్‌ఎస్ మణితో ఒప్పందం జరిగింది. దీని తర్వాత కంపెనీ షేర్లు పెరిగాయి.

45
ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల జాబితా

 ర్యాంక్    పేరు           నికర విలువ (డాలర్లలో)    సోర్స్ 
1    జెఫ్ బెజోస్             201 బిలియన్                  అమెజాన్
2    ఎలోన్ మస్క్          199 బిలియన్                  టెస్లా, స్పేస్ ఎక్స్ 
3.    బెర్నార్డ్ ఆర్నౌట్   164 బిలియన్లు                 ఎల్‌వి‌ఎం‌హెచ్ 
4.    బిల్ గేట్స్             154 బిలియన్లు                 మైక్రోసాఫ్ట్
5    మార్క్ జుకర్బర్గ్      140 బిలియన్                  ఫేస్ బుక్ 

55

6    లారీ పేజీ              128 బిలియన్    గూగుల్ 
7    సెర్గీ బ్రిన్              124 బిలియన్లు    గూగుల్ 
8    స్టీవ్ వాల్మెర్         108 బిలియన్      మైక్రోసాఫ్ట్
9.    లారీ ఎల్లిసన్       104 బిలియన్లు    ఒరాకిల్
10.  వారెన్ బఫెట్       103 బిలియన్లు    బెర్క్‌షైర్ హాత్‌వే
 

click me!

Recommended Stories