మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రెండు నెలల్లో మూడు సార్లు పెంపు...

First Published Sep 2, 2021, 3:07 PM IST

న్యూఢిల్లీ: భారతదేశంలో నాన్-సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ ధరలను బుధవారం మళ్లీ  సవరించారు. ప్రస్తుత ఎల్‌పి‌జి ధర రూ. 25 పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884,50 చేరింది. ఢిల్లీలో 19-కిలోల వాణిజ్య సిలిండర్ ధర  రూ.75  పెంపుతో  ఇప్పుడు రూ.1,693  చేరింది.
 

ఒక నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓ‌ఎం‌సిలు)  ఎల్‌పి‌జి ధరలను రెండు సార్లు సవరించాయి. ఆగష్టు 17న ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధరను రూ .25 పెంచడంతో రూ. 859కి చేరింది. ఎల్‌పి‌జి ధర తాజా పెంపు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

కోల్‌కతాలో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ .911, ముంబైలో రూ .884.5, చెన్నైలో రూ. 900.50. ఎల్‌పి‌జి ధరలు ప్రతి నెల 1 తేదీన సమీక్షితారు. గత ఎనిమిది నెలల్లో వంట గ్యాస్ ధర సిలిండర్‌పై రూ .190 పెరిగింది. ప్రభుత్వ విధానం ప్రకారం ప్రతి ఇంటికి 14.2-కిలోల 12 సిలిండర్లను సబ్సిడీ లేదా మార్కెట్ ధరల క్రింద సరఫరా చేస్తుంది.  

గత ఏడు సంవత్సరాలలో దేశీయ వంట గ్యాస్ ధర రెట్టింపు అయింది. దేశీయ గ్యాస్ రిటైల్ విక్రయ ధరను  1 మార్చి 2014న 14.2 కిలోల సిలిండర్ రూ.410. 

 ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 15 పైసలు తగ్గి రూ. 101.34 అలాగే రూ. 88.77 చేరాయి. ముంబైలో  పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.39 ఉంది.  దేశవ్యాప్తంగా కూడా ఇంధన ధరలు లీటరుకు 15-20 పైసల మధ్య తగ్గింది కానీ  రిటైల్ ధరలు ప్రతి రాష్ట్రంలో స్థానిక పన్నుల బట్టి మారుతూ ఉంటాయి.

click me!