బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-II అంత్యక్రియలకు సంబంధించిన సీక్రెట్ ప్లాన్ లీక్.. అందులో ఏముందంటే ?

First Published Sep 4, 2021, 1:50 PM IST

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తరువాత ఆమె అంత్యక్రియలకు సిద్ధం చేసిన ఇంటెలిజెన్స్ ప్లాన్ లీకైంది. క్వీన్ ఎలిజబెత్ II మరణించిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాల ప్రణాళికలను శుక్రవారం లీక్  డాక్యుమెంట్స్ వెల్లడించాయి. దీంతో ఈ సమయంలో బ్రిటన్‌లో ఏమి జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. 

అక్కడ ప్రభుత్వం చేసే ఏర్పాట్లు ఏమిటి ? రాజ కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి ? ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయా ? అంత్యక్రియల ఆచారాలు ఎలా నిర్వహించబడతాయి ? లండన్‌లో సమావేశం ఎలా నియంత్రించబడుతుంది ? తెలుసుకుందాం...

పేరు: 'ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్'

మీడియా నివేదికల ప్రకారం దీనికి 'ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్' అని పేరు పెట్టారు. ఈ‌ 95 ఏళ్ల రాణి బ్రిటిష్ చరిత్రలోనే అతి పెద్ద రాణి. ఆమె మరణించిన 10 రోజుల తర్వాత ఆమెని సమాధి చేయనున్నారు ఇంకా ఆమె కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్  రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు ముందు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు.

లండన్‌లో ఆహార కొరత సాధ్యమే

లికైన డాక్యుమెంట్స్ ప్రకారం రాణి ఎలిజబెత్ II మరణం తరువాత ఆమె మృతదేహాన్ని మూడు రోజుల పాటు పార్లమెంటులో ఉంచుతారు. ఈ సమయంలో లక్షలాది మంది ప్రజలు లండన్‌కు చేరుకోవచ్చని  గ్రిడ్‌లాక్ అండ్ పోలీసింగ్, ఆహార కొరత భయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు
 

రద్దీ ఇంకా గందరగోళాన్ని ఎదుర్కోవడానికి

అంత్యక్రియల సమయంలో  రద్దీ అలాగే గందరగోళాన్ని ఎదుర్కోవడానికి విస్తృతమైన భద్రతా ఆపరేషన్ ప్లాన్ చేసారు. క్వీన్ అంత్యక్రియల రోజున జాతీయ సంతాపం ఉంటుందని బ్రిటిష్ ప్రధాని, రాణి అంగీకరించినట్లు తెలిసింది. ఈ రోజు సెలవుదినం కానుంది కానీ అలా పేర్కొనలేదు. 

వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నారు

న్యూస్ ఏజెన్సీ పి‌టి‌ఐ నివేదిక ప్రకారం ఈ లీకైన డాక్యుమెంట్లు లేదా ప్లాన్ గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. 2017లో 'ది గార్డియన్' వార్తాపత్రిక ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ గురించి ఒక కథనాన్ని ప్రచురించిందని, దీనిలో రాణి మరణం తర్వాత ప్రిన్స్ చార్లెస్ రాజు అవుతాడని తెలిపింది.
 

click me!