నిషేధం తరువాత నేటి నుండి ఇండియాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం.. ?

First Published Aug 7, 2021, 1:07 PM IST

క్రెడిట్ కార్డ్ కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (AmEx) నేటి నుండి భారతదేశంలో పాక్షికంగా  వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు సూచించింది. మూడు నెలల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 'పేమెంట్ సిస్టమ్ డాటా స్టోరేజ్' నిబంధనలను పాటించనందుకు నినదించింది. 

అలాగే మే 1 నుంచి కొత్త దేశీయ కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆర్‌బిఐ సంస్థను నిషేధించింది. అయితే ఇప్పుడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆర్‌బి‌ఐ ఆదేశాలకు అనుగుణంగా తన విధానాలను సవరించింది అలాగే ఆగస్టు 7 నుండి కార్యకలాపాలను పాక్షికంగా తిరిగి ప్రారంభించెందుకు సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం కంపెనీ ఈ సమాచారాన్ని తన బ్యాంకింగ్ భాగస్వాములకు తెలిపింది. నివేదిక ప్రకారం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆర్‌బిఐ సూచనలను ఖచ్చితంగా పాటిస్తుందని, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని వ్యాపారాన్ని నిర్వహించదని చెప్పింది.
 

మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం మాట్లాడుతూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మాస్టర్‌కార్డ్ అండ్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లపై రెగ్యులేటర్ మార్గదర్శకాలను పాటించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో ఆర్‌బిఐ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగినప్పుడు దానిని పాటించేలా చూడడం మా బాధ్యత అని ఆయన అన్నారు.  
 

నిబంధనలను ఉల్లంఘించారు

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అండ్ డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెండు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ వ్యవస్థల చట్టం, 2007 (పి‌ఎస్‌ఎస్ చట్టం) కింద దేశంలో కార్డ్ నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి ఇద్దరికీ అధికారం ఉంది. 

23 ఏప్రిల్ 2021న జారీ చేసిన ఆర్డర్ కింద అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అండ్ డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్‌పై ఆర్‌బి‌ఐ ఈ పరిమితిని విధించింది. "ఈ సంస్థలు డేటా స్టోరేజ్ అండ్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధించిన సూచనలను పాటించడం లేదు" అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

click me!