శ్రీలంకకు ముకేష్ అంబానీ భార్య.. కప్పులు, సాసర్లు కొనేందుకు ప్రైవేట్ జెట్‌లో..

First Published Aug 6, 2021, 7:13 PM IST

బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న ఆమె, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిని వివాహం చేసుకుంది. ఆమె ఇంటిలో దాదాపు 170 కార్లు ఉన్నాయి ఆమె ఎవరు కాదు ఆసియా అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ. 

2010లో నీతా అంబానీ  ఇల్లు యాంటిలియా కోసం కిచెన్‌వేర్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు డబ్బు ఆదా చేయడానికి ఆమె శ్రీలంకకు వెళ్ళి షాపింగ్ చేసిందట.
 

నీతా అంబానీ తన ఇంటికి కోసం అలాగే అతిథులకు దీపావళి బహుమతుల కోసం ఎంచుకున్న కిచెన్‌వేర్ బ్రాండ్  నోరిటేక్ అనే 100 సంవత్సరాల నాటి జపనీస్ బ్రాండ్.  నోరిటేక్  దశాబ్దాల క్రితం నుండి యూ‌ఎస్ లో ఒక ప్రసిద్ధ బ్రాండ్. హోటల్ చైన్స్, విమానయాన సంస్థలు, సొంత గృహాలకు ఈ బ్రాండ్ ఎంతో ఇష్టమైనది. నోరిటేక్  టెక్నాలజి పరంగా ఉన్నతమైనది, దీని విభిన్నమైన ఉత్పత్తుల శ్రేణి అలాగే పెద్ద మార్కెట్‌తో పాటు ఉత్పత్తుల కోసం వేలాది డాలర్లు ఖర్చు చేసే ప్రపంచంలోని ప్రముఖులను ఆకర్షిస్తోంది.
 

 నోరిటేక్ బ్రాండ్ భారతదేశంలో కూడా ఉంది. అంబానీ యాంటిలియా భవనానికి దగ్గరలో ఒక అవుట్‌లెట్ ఉంది. అయిన కాని నీతా అంబానీ 1500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి వేరే దేశానికి వెళ్లి  నోరిటేక్ బ్రాండ్ వస్తువులను కొనాలని నిర్ణయించుకున్నారు. తాజాగా 2010లో నీతా అంబానీ తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించి శ్రీలంకకు వెళ్లి అక్కడ నోరిటేక్ బ్రాండ్ 25,000 కిచెన్‌వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది.
 

నీతా అంబానీ శ్రీలంకకు వెళ్లడానికి ఇంటి సమీపంలోని నోరిటేక్ అవుట్‌లెట్‌లో కొనకపోవడానికి  కారణం ధర వ్యత్యాసం. ఒక నివేదిక ప్రకారం 22 క్యారెట్ల గోల్డ్ ట్రిమ్మింగ్‌లతో కూడిన ఒక నోరిటేక్ డిన్నర్ సెట్ ధర భారతదేశంలో 800 డాలర్ల (సుమారు 60 వేలు) నుండి 2,000 డాలర్ల (లక్ష యాభై వేలు) మధ్య ఖర్చు అవుతుంది, వీటిని శ్రీలంకలో 300 డాలర్ల  నుండి  500 డాలర్ల మధ్య ఖర్చు అవుతుంది. 

శ్రీలంక వెళ్లడానికి రావడానికి అవసరమైన ఇంధన ఖర్చులను లెక్కించినప్పటికీ భారీ ఆర్డర్  కారణంగా నీతా అంబానీ మంచి మొత్తాన్ని ఆదా చేయగలరని నివేదికలు అంచనా వేశాయి. శ్రీలంకలో నోరిటేక్ ఉత్పత్తులు భారతదేశం కంటే చౌకగా ఉంటాయి ఎందుకంటే శ్రీలంకలో ఒక నోరిటేక్ ఫ్యాక్టరీ ఉంది,  ఇందులో అన్ని ఉత్పత్తులను తయారు చేస్తారు. సుంకాలు, పన్నులు మొదలైనవి కలుపుకొని  శ్రీలంకలో నోరిటేక్ ఉత్పత్తుల ధరలు భారతదేశంలో కంటే చాలా తక్కువగా ఉంటాయి.
 

రిలయన్స్ ప్రతినిధి ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా, ఈ శ్రీలంక ట్రిప్  గురించి భారతదేశం, శ్రీలంక అంతటా వర్తగా నిలిచింది. ప్రైవేట్ క్లయింట్ల నుండి ఇంత పెద్ద ఆర్డర్‌లను నోరిటేక్ స్వీకరించదు. ఒక నివేదిక ఈ  పెద్ద ఆర్డర్ సాధారణంగా  500 గదులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ ఐదు రెస్టారెంట్ల నుండి వచ్చినట్లు అంచనా వేసింది.

click me!