సీన్ రివర్స్ : జెఫ్ బెజోస్- ఎలోన్ మస్క్‌ అధిగమించి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్

First Published Aug 7, 2021, 11:07 AM IST

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ (ఎల్‌వి‌ఎం‌హెచ్) ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగ అవతరించాడు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేథ ఎలోన్ మస్క్ లను అధిగమించి  బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ ఘనత సాధించాడు. 

అతను ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో 198.8 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. జెఫ్ బెజోస్ 194.9 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో, ఎలోన్ మస్క్ 185.5 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
 

బెర్నార్డ్ ఆర్నాల్ట్ గతంలో డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021, జూలై 2021లో కూడా ఈ ఘనతను సాధించాడు. నిజానికి కరోనా మహమ్మారి తర్వాత లూయిస్ విట్టన్ సంపాదన వేగంగా పెరిగింది. 2021 ప్రథమార్ధంలో దాని బ్రాండ్లు అనేక రికార్డ్ అమ్మకాలు, లాభాలను నమోదు చేశాయి. 
 

2021లో కంపెనీ మొదటి త్రైమాసిక ఆదాయాన్ని 14 యూరోల బిలియన్‌గా నివేదించటంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎలోన్ మస్క్‌ను అధిగమించాడు, దీనిని 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 32 శాతం పెరిగింది.

ఎల్‌వి‌హెచ్‌ఎంలో 70 బ్రాండ్‌లు ఉన్నాయి, వీటిలో లూయిస్ విట్టన్, సెఫోరా, టిఫనీ & కో, స్టెల్లా మాక్కార్ట్నీ, గూచీ, క్రిస్టియన్ డియోర్ అండ్ గివెన్చీ ఉన్నాయి, ఇవి స్వతంత్రంగా ఎల్‌వి‌హెచ్‌ఎం గొడుగు కింద నిర్వహించబడుతున్నాయి.

click me!