విజయ్ మాల్యా, నీరవ్ మోడిలకు షాకిచ్చిన ఈడీ.. రూ.792 కోట్ల ఆస్తుల జప్తు..

First Published Jul 17, 2021, 12:56 PM IST

 బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు పొంది విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు  మరో పెద్ద దెబ్బ తగిలింది. రుణాల ఎగవేత కేసుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని బృందం విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు  చెందిన జప్తు చేసిన షేర్ల అమ్మకాల నుంచి రూ .792.11 కోట్లు వసూల్ చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తెలిపింది.  

గత నెలలో బ్యాంక్ మోసాల నిందితులు మాల్యా, చోక్సీ, నీరవ్ మోడీలను ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద మూడు కేసుల్లో రూ .18,170.02 కోట్ల విలువైన ఆస్తులు (బ్యాంకులకు జరిగిన మొత్తం నష్టంలో 80.45 శాతం) అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. దీనితో పాటు రూ .9371.17 కోట్ల విలువైన అటాచ్డ్ జప్తు చేసిన ఆస్తులలో కొంత భాగాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈ ముగ్గురి ఆస్తుల అమ్మకం నుండి మొత్తం రికవరీ రూ.13,109.17 కోట్ల చేరుకుంది.
undefined
పిఎన్‌బి కుంభకోణంలో చిక్కుకున్న విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వారి కంపెనీల ద్వారా నిధులను మళ్లించి ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని ఫలితంగా బ్యాంకులకు మొత్తం రూ .22,585.83 కోట్ల నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి రూ. 9,000 కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేశారన్న ఆరోపణలతో మాల్యాపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
undefined
undefined
click me!