Reliance Jio: రిలయన్స్ వినియోగదారులకు బంపర్ ఆఫర్: జియోలో రూ.100కే హాట్‌స్టార్ సబ్‌స్క్రిబ్షన్

Published : May 17, 2025, 01:15 PM IST

Reliance Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ అందించే ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 100 రూపాయలకే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సినిమా, టీవీ ప్రియులకు ఈ ఆఫర్  చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
15
Reliance Jio: రిలయన్స్ వినియోగదారులకు బంపర్ ఆఫర్: జియోలో రూ.100కే హాట్‌స్టార్ సబ్‌స్క్రిబ్షన్

భారతదేశంలో 49 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తున్న సంస్థగా రిలయన్స్ జియో నంబర్ 1 స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి పోటీ ఉన్నప్పటికీ జియో తక్కువ ధర ప్లాన్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఇప్పుడు రిలయన్స్ జియో కేవలం 100 రూపాయలకే 299 రూపాయల విలువైన OTT ప్రయోజనాలను అందించే కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

25

జియో రూ.100 ప్లాన్

ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూసే వారి కోసం రూపొందించారు. తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. 

జియో కొత్తగా ప్రకటించిన ఈ రూ.100 ప్లాన్ సాధారణంగా రూ.299 ప్లాన్‌లో లభించే ప్రయోజనాలను అందిస్తుంది. ఇది OTT ప్రియులకు చాలా బాగుంటుంది.

35

90 రోజులు జియో సినిమా ఉచితం

కేవలం 100 రూపాయలకే లభించే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్‌తో 5 GB డేటా లభిస్తుంది. 90 రోజుల పాటు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.

OTT ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లకు ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.

45

జియో విధించిన 2 షరతులు పాటిస్తేనే..

ఈ 100 రూపాయల ప్లాన్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, వినియోగదారులు రెండు ముఖ్యమైన కండీషన్స్ ని గమనించాలి. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి మీ జియో నంబర్‌లో యాక్టివ్ బేస్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. కేవలం రూ.100 ప్లాన్ బేస్ ప్లాన్ గా పనిచేయదు.  

 

55

రెండో కండీషన్ ఏంటంటే.. ఈ రూ.100 ప్లాన్ మీ సిమ్‌ను ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంచదు. ఇది కేవలం OTT యాక్సెస్, లిమిటెడ్ డేటా కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సిమ్ యాక్టివేషన్ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేయించుకోవాలి.

Read more Photos on
click me!