Electric Scooters: రూ.లక్ష లోపే లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

Published : May 16, 2025, 11:31 PM IST

Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో రూ.లక్ష లోపు లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుక్కోవాలనుకుంటే ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓసారి పరిశీలించండి. 

PREV
15
Electric Scooters: రూ.లక్ష లోపే లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఎంత ఎక్కువగా, వేగంగా జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే మీరు ఏప్రిల్ 2025 డేటా తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలకు ఆ నెల తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఎందుకంటే ఓ సర్వే ప్రకారం గత నెలలో స్కూటర్లు, బైక్‌లు, మోపెడ్‌లతో సహా 91,791 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (E2Wలు) భారతదేశంలో అమ్ముడయ్యాయి. ఇది వార్షికంగా 40% వృద్ధిని సూచిస్తుంది. ఇది 2023 ఏప్రిల్ నెలలో అమ్మకాల కంటే ఎక్కువ. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుక్కోవాలని అనుకొనే వారికి ఇదే మంచి టైం. 

25

ఓలా S1 X 2 kWh: రూ.73,999

ఓలా ఎలక్ట్రిక్ S1 X ఎలక్ట్రిక్ స్కూటర్‌ 2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 9.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 3.4 సెకన్లలో 0 - 40 kmph వేగాన్ని అందుకుంటుంది. IDC ప్రకారం ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 108 కి.మీల పరిధి వరకు వెళ్తుంది. అత్యధికంగా 101 కి.మీల వేగాన్ని కలిగి ఉంది. ఇది స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది. ఇది 4 గంటల 50 నిమిషాల్లో 0 - 80% వరకు ఛార్జ్ అవుతుంది. 

Ola S1 X 3 kWh: రూ.97,999

S1 X 3 kWh అనేది 2 kWh మోడల్ కంటే ఒక అడుగు ముందుంది. 3.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 115 కి.మీల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో డిజిటల్ కీ, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉన్నాయి.

35

TVS iQube: రూ.94,434

iQube ఎంట్రీ లెవల్ ట్రిమ్ 2.2 kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 5.9 bhp, 140 Nm పీక్ టార్క్‌ను కలిగి ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇది 4.2 సెకన్లలో 0 - 40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 75 kmph వేగంతో ప్రయాణించగలదు. IDC పరిధి ప్రకారం ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఇది 94 కి.మీ. వెళ్లగలదు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 157 మి.మీ. సీట్ ఎత్తు 770 మి.మీ. ఇది 2 గంటల 45 నిమిషాల్లో 0 - 80% వరకు ఛార్జ్ అవుతుంది. 

45

Bajaj Chetak 2903: రూ.98,498

బజాజ్ చేతక్ 2903 స్కూటర్ 2.9 kWh బ్యాటరీతో 5.3 bhp అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీల వెళ్లగలదు. 4 గంటల్లో 0–80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో ఎకో, స్పోర్ట్స్, హిల్ హోల్డ్ అనే రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఫోన్ కాల్స్ స్వీకరించడానికి బ్లూటూత్ కనెక్టివిటీ, నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ ప్లే చేయడం వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 211 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

55

Hero Vida V2 Lite: రూ.74,000

హీరో విడా 2 లైట్ అనేది 2.2 kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని తీసి పెట్టుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 94 కి.మీల వరకు వెళ్లగలదు. గరిష్టంగా 69 kmph వేగంతో ప్రయాణించగలదు. ఇది 7 అంగుళాల TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది. ఇందులో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది 26 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories