రోజంతా ఫుల్‌గా రీల్స్, వీడియోలు చూసేయండి: జియోలో కేవలం రూ.49కే డేటా ప్లాన్

Published : Jan 18, 2025, 09:47 AM IST

రిలయన్స్ జియో బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్‌తో మార్కెట్‌లో దూసుకుపోతోంది. 490 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్న జియో కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం రూ.49 డేటా ప్యాక్ తో కస్టమర్లకు అందించే సదుపాయాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

PREV
14
రోజంతా ఫుల్‌గా రీల్స్, వీడియోలు చూసేయండి: జియోలో కేవలం రూ.49కే డేటా ప్లాన్

యూజర్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్స్‌తో టెలికాం రంగంలో రిలయన్స్ జియో ముందు వరుసలో ఉంది. పోటీ కంపెనీలైన ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ నుంచి వస్తున్న పోటీని తట్టుకొనేందుకు ఎప్పటికప్పుడు తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉంది. ఇప్పటికే బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు తన కస్టమర్లు మారిపోకుండా కాపాడుకోవడానికి తక్కువ ధరకే డాటా ప్లాన్స్ అందిస్తోంది. 

 

24

అలాంటి ఓ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్ రూ.49 ప్లాన్‌. దీని ద్వారా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా అందిస్తోంది. ప్రస్తుతం ఇది మార్కెట్ లో కొత్త కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. 

రూ.49 రీఛార్జ్ ప్లాన్ వివరాలు

జూలై 2024లో రిలయన్స్ జియో చాలా రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచింది. కొన్ని తక్కువ ధర ప్లాన్స్‌ను తీసేసింది. అయినప్పటికీ కొత్తగా తక్కువ ధరలో ప్లాన్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో జియో రూ.49 ప్లాన్ ఒకటి. ఇది ఇంటర్నెట్ బాగా వాడే యూజర్లకు ఎక్కువ ఉపయోగపడుతుంది.

 

34

అన్‌లిమిటెడ్ డేటా

జియో తన డేటా ప్యాక్స్‌లో అతి తక్కువ ధర రూ.49కు రీఛార్జ్ ప్లాన్‌ అందిస్తోంది. ఈ రీఛార్జ్‌లో కాల్స్, SMSలు ఉండవు. కాని రోజూ డేటా లిమిట్ అయిపోయే వారికి ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారికి ఇది మంచి ఆప్షన్. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా జియో ఎక్కువ మంది యూజర్లకు ఆకర్షిస్తోంది. 

44

పోటీని పెంచిన జియో.. 

రిలయన్స్ జియో నుంచి ఇంత తక్కువ ధరకే డేటా ప్లాన్ అందుబాటులో ఉండటంతో ఎయిర్ టెల్, VI, BSNL వంటి కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. డాటా ప్లాన్స్ తగ్గించాలా? జియో మాదిరి కొత్త ప్లాన్స్ తీసుకు రావాలో తెలియక పోటీ కంపెనీలు సతమతమవుతున్నాయి. జియో మాత్రం తన కస్టమర్లకు తక్కువ ధర ప్లాన్స్ అందిస్తూ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. టెలికాం రంగంలో పోటీని పెంచుతోంది.

click me!

Recommended Stories