ఈ అద్భుతమైన కలెక్షన్స్ రిలయన్స్ జ్యువెల్స్ ప్రతిష్ఠాత్మక షోరూములు, దేశవ్యాప్తంగా షాప్-ఇన్-షాప్స్‌తో పాటు రిలయన్స్ జ్యువెల్స్ వెబ్‌సైట్ https://www.reliancejewels.com లో ప్రత్యేకంగా లభిస్తాయి.
రిలయన్స్ జ్యూవెల్స్ గురించి
భారతదేశంలో టాప్ 10 విశ్వసనీయమైన బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో భాగం రిలయన్స్ జ్యువెల్స్. అద్భుతమైన, విస్తృత శ్రేణి గోల్డ్, డైమండ్, ప్లాటినం & సిల్వర్ ఆభరణాల కలెక్షన్స్ అందిస్తుంది ఈ బ్రాండ్. డిజైన్, నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళలు, హస్తకళలు, ఘనమైన భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొంది ప్రత్యేకమైన, వైవిధ్యమైన డిజైనర్ కలెక్షన్స్‌ను కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. జీవితంలోని ప్రతీ ప్రత్యేక క్షణాన్ని స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన బంగారపు తాడుతో వేడుకగా జరుపుకోవాలని రిలయన్స్ జ్యువెల్స్ నమ్ముతుంది.
భారతదేశంలో 100+ నగరాల్లో 200+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులు కలిగిన రిలయన్స్ జ్యువెల్స్ వాటిని గణనీయంగా విస్తరిస్తోంది. ఖాతాదారులకు అనుపమానమైన సేవలు, ఒక ప్రత్యేకమైన ఆభరణాల కొనుగోలు షాపింగ్ అనుభూతిని అందించేందుకు బ్రాండ్ ఎల్లవేళల కృషి చేస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో స్వర్ణ, వజ్రాభరణాలు అత్యంత సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జీరో వేస్టేజ్, సరసరమైన తయారీ ఛార్జీలు కొనుగోలుదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్ 100 శాతం స్వచ్ఛత, పారదర్శకమైన ధరల విధానం, ప్రతీ వస్తువుపై హమీపూర్వక నాణ్యతను అందిస్తుంది. 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్డ్ బంగారం, అంతర్జాతీయంగా స్వతంత్ర ధ్రువీకరణ ప్రయోగశాలలు ధ్రువీకరించిన ఆభరణాలను మాత్రమే ఈ బ్రాండ్ విక్రయిస్తుంది. రిపేర్ల కోసం క్యూసీ టెక్‌రూమ్స్‌తో పాటు బంగారం స్వచ్ఛతను కొనుగోలుదారులు ఉచితంగా తెలుసుకునేందుకు క్యారెట్ మీటర్, ఇంకా ఎన్నో సేవలను రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది.