todays petrol diesel prices:పెట్రోలు, డీజిల్ తాజా ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు మరింత తగ్గింపు..

Ashok Kumar   | Asianet News
Published : Nov 29, 2021, 02:06 PM IST

దీపావళి సందర్భంగా ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గాయి. నేడు వరుసగా 27వ రోజు అంటే నవంబర్ 29 పెట్రోల్, డీజిల్ ధరలు   స్థిరంగా ఉన్నాయి.

PREV
15
todays petrol diesel prices:పెట్రోలు, డీజిల్ తాజా ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు మరింత తగ్గింపు..

ముఖ్యంగా కేంద్రం పెట్రోల్‌ ధరపై రూ. 5, డీజిల్ ధరపై రూ. 10 తగ్గించింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి ఇంధనాలపై వాల్యు ఆధారిత పన్ను (VAT) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కూడా కోరింది. దీంతో పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గింపును ప్రకటించాయి, దీంతో ఇంధన ధరలు మరింత  దిగోచ్చాయి.

25

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు కేంద్రం చేసిన అభ్యర్థనతో పెట్రోల్ ధరలను తగ్గించాయి. పంజాబ్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.16.02 తగ్గగా, డీజిల్ ధర రూ.19.61 తగ్గింది.  
 

35

దేశంలోని కొన్ని మెట్రోలు అండ్ టైర్-II నగరాల్లో ఇంధన ధరలు:

ముంబై:పెట్రోలు - లీటరుకు రూ.109.98
డీజిల్ - లీటరుకు రూ.94.14

ఢిల్లీ:పెట్రోలు - లీటరుకు రూ.103.97
డీజిల్ - లీటరుకు రూ.86.67

చెన్నై:పెట్రోలు - లీటరుకు రూ.101.40
డీజిల్ - లీటరుకు రూ.91.43

కోల్‌కతా:పెట్రోలు - లీటరుకు రూ.104.67
డీజిల్ - లీటరుకు రూ.89.79

భోపాల్ :పెట్రోలు - లీటరుకు రూ.107.23
డీజిల్ - లీటరుకు రూ.90.87

హైదరాబాద్ :పెట్రోలు - లీటరు రూ.108.20
డీజిల్ - లీటరుకు రూ.94.62

45

బెంగళూరు:పెట్రోలు - లీటరు రూ.100.58
డీజిల్ - లీటరుకు రూ. 85.01

గౌహతి:పెట్రోలు - లీటరు రూ.94.58
డీజిల్ - లీటరుకు రూ.81.29

లక్నో:పెట్రోలు - లీటరు రూ.95.28
డీజిల్ - లీటరు రూ.86.80

గాంధీనగర్ :పెట్రోలు - లీటరు రూ.95.35
డీజిల్ - లీటరుకు రూ.89.33

తిరువనంతపురం:పెట్రోలు - లీటరుకు రూ.106.36
డీజిల్ - లీటరుకు రూ.93.47

ఒక నివేదిక ప్రకారం అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం పెరిగాయి, శుక్రవారం నాడు బ్యారెల్‌కు సుమారు $10 పడిపోయిన తరువాత కొంత నష్టాన్ని తిరిగి పొందింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం $9.50 పడిపోయిన తర్వాత 0014 GMT నాటికి $3.05 లేదా 4.2 శాతం పెరిగి $75.77కి చేరుకుంది.

55

భువనేశ్వర్‌లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటరు పెట్రోలు ధర రూ.102.10గా నమోదుకాగా, డీజిల్ ధర ఈరోజు రూ.91.91గా నమోదైంది. ఆదివారం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.102.17గా నమోదు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.91.97గా నమోదైంది. గత 24 గంటల్లో పెట్రోల్ పై  7, డీజిల్ 6 పైసలు తగ్గింది.

click me!

Recommended Stories