రిలయన్స్ చేతికి ప్రముఖ చైనా కంపెనీ.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందో తెలుసా..?

First Published Oct 11, 2021, 2:21 PM IST

భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) సౌర శక్తి రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్ (గ్రూప్) నుండి ఆర్‌ఈ‌సి సోలార్ హోల్డింగ్స్  ఏ‌ఎస్(REC group) లో 100% వాటాను రిలయన్స్ న్యూ ఎనర్జీ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం $ 7710 మిలియన్లకు జరిగింది. అంటే సుమారు 700 కోట్లకు పైమాటే.

చైనీస్ కంపెనీ ఆర్‌ఈ‌సి ఒక మల్టీ నేషనల్ సౌర శక్తి సంస్థ. టెక్నాలజి ఇన్నోవేషన్, అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్యానెల్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. గత 25 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రముఖ సోలార్ ప్యానెల్, పాలిసిలికాన్ తయారీ కంపెనీలలో ఒకటి. ఆర్‌ఈ‌సి సోలార్ హోల్డింగ్స్ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది, కార్యాచరణ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ఈ కంపెనీకి ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ లో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. నార్వేలో రెండు, సింగపూర్‌లో ఒకటి తయారీ యూనిట్లు ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మాట్లాడుతూ, "సూర్యుడి అపరిమిత సౌర శక్తిని సంవత్సరం పొడవునా ఉపయోగించుకోవడంలో సహాయపడేందుకు ఆర్‌ఈ‌సిని కొనుగోలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దశాబ్దం ముగిసేలోపు 100 GW క్లీన్ అండ్ గ్రీన్ పవర్ సృష్టించాలనే రిలయన్స్ లక్ష్యాన్ని సాధించి కొత్త, అధునాతన టెక్నాలజీలలో పెట్టుబడి పెట్టాలనే మా వ్యూహానికి అనుగుణంగా ఈ కొనుగోలు జరిగింది. 

2030 నాటికి 450 GW పునరుత్పాదక ఇంధనాన్ని భారతదేశంలో ఉత్పత్తి చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడంలో  ఒక సంస్థ అతిపెద్ద సహకారం. దీనివల్ల వాతావరణ సంక్షోభాన్ని అధిగమించడానికి, గ్రీన్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి భారతదేశానికి సహాయపడుతుంది.  భారతదేశంలో ఇంకా ప్రపంచవ్యాప్త మార్కెట్లలోని కస్టమర్లు అధిక నాణ్యత, విశ్వసనీయమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు పొందవచ్చు. గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లో డీసెంట్రలైజేడ్ మ్యానర్ లో లక్షలాది గ్రీన్ ఉద్యోగాలు సృష్టిస్తుంది.

600 కంటే ఎక్కువ పేటెంట్‌లు

ఆర్‌ఈ‌సికి 600 యుటిలిటీ అండ్ డిజైన్ పేటెంట్‌లను కలిగి ఉంది. వీటిలో 446 ఆమోదించబడ్డాయి, మిగిలినవి వాల్యువేషన్ ఉన్నాయి. ఆర్‌ఈ‌సి అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన బ్రాండ్, అలాగే దాని ఇన్నోవేషన్స్ ప్రసిద్ధి చెందింది. ఆర్‌ఈ‌సిలో 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు రిలయన్స్ కుటుంబంలో భాగం అవుతారు. జామ్‌నగర్‌లో నిర్మించే ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌లో ఆర్‌ఈ‌సి అత్యుత్తమ టెక్నాలజిని రిలయన్స్ ఉపయోగించుకొనుంది.

స్టెర్లింగ్ & విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటా

 స్టెర్లింగ్ & విల్సన్ సోలార్‌ అనేది కన్స్ట్రక్షన్ ఇంజీనీరింగ్ కంపెనీ.  అభివృద్ధి చెందుతున్న సౌరశక్తి రంగంలోకి విస్తరించాలనే ఉద్దేశ్యంతో రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) ఆదివారం మరో గొప్ప ఒప్పందాన్ని సాధించింది. కంపెనీ స్టెర్లింగ్ & విల్సన్ సోలార్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. 2030 నాటికి దేశంలో 100 GW సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి రిలయన్స్ మరో అడుగు ముందుకేసిందని తెలిపింది. వాటాల కొనుగోలు కోసం ఆర్‌ఎన్‌ఈ‌ఎస్‌ఎల్ షాపూర్జీ పల్లోంజి & కో ప్రైవేట్ లిమిటెడ్, ఖుర్షీద్ దారువాలా  ఇంకా కే‌ఏ స్టెర్లింగ్ & విల్సన్ సోలార్‌తో జతకట్టింది.

మూడు రెట్లు పెరిగిన జియో హాప్టిక్ ప్లాట్‌ఫామ్ వ్యాపారం

 జియో  హాప్టిక్ ప్లాట్‌ఫామ్ వ్యాపారం సంవత్సరానికి మూడు రెట్లు పెరిగింది. హ్యాప్టిక్ ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత ఇంటరాక్షన్ ప్లాట్ ఫార్మ్.  వాట్సాప్‌తో లింక్ చేయడం ద్వారా ఈ-కామర్స్ వ్యాపారాన్ని పెంచడంపై చాలా ఆశాజనకంగా ఉంది. జియో హాప్టిక్ సహ వ్యవస్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ అక్రిత్ వైష్ మాట్లాడుతూ కంపెనీ వ్యాపారం విదేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దీనికి ప్రధాన మార్కెట్‌గా అమెరికా అవతరించింది. హాప్టిక్ (Haptik) ముఖ్యమైన క్లయింట్లు డ్రీమ్ 11, ఓయో రూమ్స్, లెన్స్‌కార్ట్, ఓలా క్యాబ్, పెప్పర్‌ ఫై, అప్‌స్టాక్స్, హావెల్స్, సీట్, యురేకా ఫోర్బ్స్ మొదలైనవి. హ్యాప్టిక్ కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇది ఒక కన్వర్జేషన్ ఆధారిత చాట్‌బూట్.

click me!