ఇంధన ధరల బాదుడు.. వరుసగా 7వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..

First Published Oct 11, 2021, 10:51 AM IST

దేశవ్యాప్తంగా సోమవారం వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీల ప్రకారం  నేడు పెట్రోల్ ధరపై లీటరుకు 30 పైసలు, డీజిల్ లీటరుకు 35 పైసలు పెరిగింది. అక్టోబర్ మొదటి 10 రోజుల్లో పెట్రోల్ ధర రూ .2.80 పెరిగగా  డీజిల్ ధర రూ .3.30 పెరిగింది.
 

ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్  ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు  పెరిగింది.  దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.104.44 చేరగా డీజిల్ ధర రూ.93.17 చేరింది.

ప్రముఖ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర  
 ఢిల్లీలో పెట్రోల్ ధర  రూ 104.44, డీజిల్ ధర  రూ 93.18 
ముంబైలో  పెట్రోల్ ధర  రూ 110.41, డీజిల్ ధర  రూ 101.03 
 చెన్నైలో  పెట్రోల్ ధర   రూ 101.79, డీజిల్ ధర  రూ 97.59 
కోల్‌కతాలో  పెట్రోల్  ధర రూ .105.09, డీజిల్ ధర  రూ. 96.28
హైదరాబాద్ పెట్రోల్ ధర రూ. 108.64, డీజిల్ ధర రూ.101.66 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)అంతర్జాతీయ ధర ఇంకా విదేశీ మారక రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. ఒక నెల క్రితం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 72 డాలర్లుగా ఉంది. మే 4 నుండి జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటరుకు 11.44, డీజిల్ ధర  9.14 పెరిగింది.

జూలై ఇంకా ఆగస్టులో అంతర్జాతీయ ముడి చమురు ధరలు రెండు వైపులా కదులుతుండటంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓ‌ఎం‌సిలు) జూలై 18 నుండి సెప్టెంబర్ 23 వరకు ధరల పెంపును నిరోధించాయి. అంతేకాకుండా పెట్రోల్ ధర లీటర్ రూ. 0.65, డీజిల్ రూ .1.25 తగ్గిపోయింది. సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 28 మధ్య మళ్ళీ ధరలను  పెంచడం ప్రారంభించాయి.

ముంబై పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది, డీజిల్ ధర లీటరుకు రూ. 101.03గా ఉంది. ధరల వ్యత్యాసం వివిధ నగరాల్లో స్థానిక వ్యాట్ ఛార్జీల కారణంగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు సరుకు ఛార్జీలు, స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. రాయిటర్స్ ప్రకారం, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83.20 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ బ్యారెల్ 80.50 డాలర్ల వద్ద ఉన్నాయి.

click me!