బ్యాంకు హాలిడేస్ లిస్ట్: ఆక్టోబరులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ‌ తేదీలను గుర్తుపెట్టుకోండి..

First Published Oct 11, 2021, 12:07 PM IST

న్యూఢిల్లీ: అక్టోబర్ 2021లో నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగలు రానున్నాయి. ఈ క్రమంలో వివిధ నగరాల్లోని బ్యాంకులు ఈ నెలలో మొత్తం 13 రోజులు మూతపడనున్నాయి. మీరు ఏదైనా బ్యాంకుకు సంబంధించి ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే ముందుగా  బ్యాంకు హాలిడేస్ లిస్ట్ తెలుసుకోండి..
 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెల అఫిషియల్ బ్యాంకు హాలిడేస్ జాబితాను ప్రచురించింది, ఇందులో మొత్తం 21 సెలవులు ఉన్నాయి. చాలా వరకు భారతీయ నగరాల బ్యాంకులు ఈ నెలలో నిరవధికంగా మూసివేయనున్నాయి. ఆర్‌బిఐ నిబంధన ప్రకారం బ్యాంకులకు ప్రతి ఆదివారాలు అలాగే ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు సెలవు ఉంటుంది.
 

ఆర్‌బి‌ఐ అందించిన సెలవుల జాబితాని మూడు కేటగిరీలుగా విభజించింది ఇందులో రాష్ట్ర పండుగలు, మతపరమైన సెలవులు, పండుగ సెలెబ్రేషన్స్ హాలిడేస్ ఉన్నాయి. 
ఆర్‌బిఐకి రిక్వైర్మెంట్ సెలవుల జాబితాను కూడా మూడు కేటగిరీలుగా విభజించింది. అఫిషియల్ క్లాసిఫికేషన్ ప్రకారం 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే,' 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే,' బ్యాంక్స్ అకౌంట్స్ క్లోసింగ్ ఉన్నాయి'. 
 

నేటి నుండి దేశంలోని వివిధ నగరాల్లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అయితే దేశంలోని అన్ని బ్యాంకులు మొత్తం 21 రోజులు మూసివేయబడవు. కానీ కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలలో మాత్రమే పాటించనున్నాయి.  ఇతర రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయి. అంతే కాదు రాబోయే నెలలో నిర్దిష్ట ప్రదేశాలలో కొన్ని బ్యాంకులు వరుసగా ఐదు రోజులు తెరిచి ఉంటాయి.  
 

12 అక్టోబర్ - దుర్గా పూజ (మహా సప్తమి) - కోల్‌కతాలోని అగర్తలాలో బ్యాంకులకు హాలిడే

13 అక్టోబర్ - దుర్గా పూజ (మహా అష్టమి) - అగర్తలా, భువనేశ్వర్, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో బ్యాంకులకు హాలిడే

అక్టోబర్ 14 - దుర్గా పూజ / దసరా (మహా నవమి) / ఆయుధ పూజ - అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం బ్యాంకులకు హాలిడే

అక్టోబర్ 15 - దుర్గా పూజ / దసరా / విజయదశ్మి - ఇంఫాల్ ఇంకా సిమ్లాలో బ్యాంకులకు హాలిడే

16 అక్టోబర్ - దుర్గా పూజ (దశైన్) - గ్యాంగ్‌టాక్ బ్యాంకులకు హాలిడే

17 అక్టోబర్ - ఆదివారం (వీకెండ్ హాలిడే)

18 అక్టోబర్ - కాటి బిహు - గౌహతి బ్యాంకులకు హాలిడే

19 అక్టోబర్-ఈద్-ఇ-మిలాద్ / ఈద్-ఇ-మిలాదున్నాబి / మిలాద్-ఇ-షరీఫ్ / బరావాఫత్- అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ , రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే

అక్టోబర్ 20 - మహర్షి వాల్మీకి పుట్టినరోజు / లక్ష్మీ పూజ / ఈద్ -ఇ -మిలాద్ - అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంకులకు హాలిడే

22 అక్టోబర్-ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత శుక్రవారం-జమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలిడే

23 అక్టోబర్ - శనివారం (నాల్గవ శనివారం)

24 అక్టోబర్ - ఆదివారం (వీకెండ్ హాలిడే)

26 అక్టోబర్ - మెర్జర్ డే - జమ్మూ అండ్ శ్రీనగర్ బ్యాంకులకు హాలిడే

31 అక్టోబర్- ఆదివారం (వీక్లీ హాలిడే)

click me!