మొట్టమొదటిసారిగా రూఫ్ టాప్ థియేటర్ తో జియో వరల్డ్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రిలయన్స్..

First Published Oct 8, 2021, 7:01 PM IST

ముంబై: రిలయన్స్ ప్రీమియం మాల్ "జియో వరల్డ్ డ్రైవ్" (JWD)ను గురువారం వాణిజ్య కేంద్రమైన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని 17.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జియో వరల్డ్ డ్రైవ్‌లో 72 ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్‌లు, 27 ఫుడ్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. 

 ముంబై  బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ డ్రైవ్ సరికొత్త, విబ్రాంట్ అర్బన్ హ్యాంగ్‌అవుట్. 

ఈ  జియో వరల్డ్ డ్రైవ్ ప్రాంగణంలో ముంబైలోనే  మొట్టమొదటి రూఫ్‌టాప్ జియో డ్రైవ్-ఇన్ థియేటర్, ఓపెన్-ఎయిర్ వీకెండ్ కమ్యూనిటీ మార్కెట్, పేట్-ఫ్రెండ్లీ సర్వీసెస్, పాప్-అప్ ఎక్స్పీరియన్స్, ఇతర బెస్పోక్ సేవలు ఉన్నాయని  కంపెనీ తెలిపింది. జియో డ్రైవ్-ఇన్ థియేటర్ ని పివిఆర్ నిర్వహిస్తుంది. పివిఆర్ ఆపరేటెడ్ జియో డ్రైవ్-ఇన్ థియేటర్ కోసం 290 కార్ల సామర్థ్యం ఉంది.

ఈ ఆవరణలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పివిఆర్ సినిమా కాన్సెప్ట్ మైసన్ పివిఆర్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త కాన్సెప్ట్ తో 6 అత్యాధునిక మల్టీప్లెక్స్ థియేటర్లు, ప్రివ్యూ థియేటర్, వి‌ఐ‌పి అతిథుల కోసం ప్రత్యేక ఎంట్రీని  లాంచ్ చేసింది.

రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సీఈఓ దర్శన్ మెహతా ఈ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ “జియో వరల్డ్ డ్రైవ్ ప్రారంభంతో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ముంబైలోని కొత్త సామాజిక కేంద్రంగా నిలిచింది. ముంబై నడిబొడ్డున ఉన్న ఇటువంటి రిటైల్ అవెన్యూ నుండి ఆశించిన అనుభవాల కోసం ఈ ప్రాంగణం కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. జియో డ్రైవ్-ఇన్ థియేటర్ వంటి ఐకానిక్ ఆఫరింగ్స్ అందరికి సంతోషకరమైన క్షణాలను సృష్టించడానికి, తప్పక సందర్శించాల్సిన గమ్యస్థానంగా మారుతుంది.

ప్రఖ్యాత డిజైన్ ఆర్కిటెక్ట్స్ రాస్ బోన్తోర్న్ అండ్ ఆండీ లాంపార్డ్ డిజైన్ చేసిన జియో వరల్డ్ డ్రైవ్  ఫ్రెంచ్ కాన్సెప్ట్ న్యూజ్ నుండి స్ఫూర్తి పొందిన రిటైల్ నిర్మాణం, చెప్పాలంటే మేఘల లాంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది.  భారతదేశపు మొదటి ఫ్లాగ్‌షిప్ అండ్  గ్లోబల్ హోమ్ డేకర్ యాంకర్ స్టోర్‌  వెస్ట్‌ ఎల్మ్  ప్రారంభించింది. ఎల్మ్ అండ్ హామ్లీస్ గ్లోబల్-ఫస్ట్ కాన్సెప్ట్ స్టోర్, దీనిని హామ్లీస్ ప్లే అని కూడా పిలుస్తారు, "అని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
 

జియో వరల్డ్ డ్రైవ్ అంతర్జాతీయ కోవిడ్ గైడ్ లైన్స్ అండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ని పాటిస్తుంది. పూర్తిగా కరోనా వాక్సినేషన్ పొందిన వారు లేదా సెకండ్ డోస్ వాక్సిన్ పొంది 14 రోజుల దాటిన వారిని మాత్రమే ఈ కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి అనుమతిస్తారు.

Connect with us: www.jioworlddrive.com | Instagram | Facebook

click me!