68 సంవత్సరాల తర్వాత తిరిగి టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా..

First Published Oct 8, 2021, 5:02 PM IST

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ  విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు చేసిన బిడ్‌లో టాటా సన్స్ విజయం సాధించింది. సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ కాంగ్లోమరేట్ టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను ప్రభుత్వానికి అప్పగించి దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా తర్వాత  18,000 కోట్ల విన్నింగ్ బిడ్‌తో తిరిగి సొంతం చేసుకుంది.

ఎయిర్ ఇండియా కోసం టాటా సన్స్ 18 వేల కోట్ల బిడ్ వేయగా స్పైస్ జెట్ అజయ్ సింగ్ 15 వేల కోట్లకు బిడ్ చేశారు. డిసెంబర్ 2021 నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎమ్) కార్యదర్శి తుహిన్ కాంత్ చెప్పారు.

ఎయిర్ ఇండియా ఫైనాన్షియల్ బిడ్ పై ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (AISAM) ప్యానెల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ప్యానెల్‌లో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర కీలక మంత్రులు, అధికారులు ఉన్నారు.
 

air india

టాటా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) టాలిస్ ప్రైవేట్ లిమిటెడ్ విజేతగా నిలిచినట్లు డిఐపిఎఎమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు.


31 ఆగస్టు 2021నాటికి  ఎయిర్ ఇండియకి మొత్తం అప్పు రూ.61,562 కోట్లు దీని నుండి  రూ.15,300 బిడ్డర్ ద్వారా హస్తగతం ఉంటుంది అని పాండే పేర్కొన్నారు. కాబట్టి మిగిలిన  రూ.46.262 కోట్లను ఎయిర్ ఇండియా అసెస్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL)కు బదిలీ చేయబడుతుంది అని అన్నారు. ఏ‌ఐ‌ఏ‌హెచ్‌ఎల్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌పి‌వి.

ఈ నెల ప్రారంభంలో టాటా సన్స్, స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్  ఇద్దరూ ఎయిర్ ఇండియా కోసం బిడ్‌లు వేశారు. అయితే టాటా సన్స్ బిడ్ గెలిచినట్లు గత నెలలో వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరస్కరించారు.

డిసెంబర్ 2020లో ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించింది. అయితే ఇందుకు నలుగురు బిడ్డర్లు ప్రముందుకు వచ్చారు. టాటా సన్స్, అజయ్ సింగ్ మాత్రమే చివరి దశకు చేరుకున్నారు.
 

నివేదికల ప్రకారం ఎయిర్ ఇండియా దాదాపు  70,000 కోట్ల నష్టాలను కూడగట్టుకుంది అంతేకాదు ప్రభుత్వం ప్రతిరోజూ దాదాపు రూ.20 కోట్లు నష్టపోతోంది. ఎయిర్ ఇండియాను విక్రయించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన రెండవ ప్రయత్నం ఇది.

కేంద్రం 2018 మార్చిలో ఎయిర్ ఇండియాలో  76 శాతం వాటాను విక్రయించడానికి  మొదట ప్రయత్నం చేసింది, కానీ పెరుగుతున్న అప్పులకు సంబంధించిన ఆందోళనల మధ్య ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

  ఎయిర్ ఇండియాకి ఇప్పటికీ దేశీయ విమానాశ్రయాలలో 4,400 డోమస్టిక్, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్ అండ్ పార్కింగ్ స్లాట్‌లు, విదేశాలలో 900 స్లాట్‌లను నియంత్రిస్తుంది.

1932లో జే‌ఆర్‌డి టాటా ఎయిర్ ఇండియాని  స్థాపించినప్పుడు టాటా ఎయిర్ సర్వీసెస్‌గా ప్రారంభమైంది. తరువాత 1953లో ప్రభుత్వం చేతుల్లోకి  చేసింది. జే‌ఆర్‌డి టాటా 1977 వరకు దాని ఛైర్మన్‌గా కొనసాగారు.

 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆసియా విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా మారింది 1960లో న్యూయార్క్ కి ప్రయాణలను ప్రారంభించింది.
 
ప్రస్తుతం టాటా గ్రూప్ సింగపూర్ ఎయిర్‌లైన్స్ అండ్ ఎయిర్ ఏషియా ఇండియా భాగస్వామ్యంతో మలేషియా ఎయిర్‌ఏషియాతో భాగస్వామ్యంతో  విస్తారాను నిర్వహిస్తోంది.

click me!