మీ ఇంటి కరెంట్ బిల్లు భారీగా వస్తోందా? ఈ సింపుల్ టిప్స్ తో సగానికి పైగా తగ్గించుకోవచ్చు

Published : Jul 04, 2025, 07:15 PM IST

మీ ఇంటి కరెంట్ బిల్లు బాగా ఎక్కువగా వస్తోందా? అపార్ట్‌మెంట్లలో అయితే మరింత ఎక్కువ వస్తుంది కదా.. వెలుతురు రాదు కాబట్టి లైట్లు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ చిన్న టిప్స్ పాటించడం ద్వారా కరెంట్ బిల్లు బాగా తగ్గించుకోవచ్చు.  

PREV
15
విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది

విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో లెక్కకు మించి బల్బులు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటున్నాయి. పరిశ్రమలు పెరిగిపోవడం వల్ల నాణ్యమైన విద్యుత్తుకు డిమాండ్ పెరిగింది. అందువల్ల ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్తులో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో విద్యుత్తును ఆదా చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఉన్న సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా కరెంట్ ఆదా చేసుకోవచ్చు. 

25
LED బల్బులు వాడండి

చాలా మంది కాంతి కోసం రకరకాల బల్బులు వాడుతుంటారు. పూర్వం అయితే ఫిలమెంట్ బల్బులు ఉపయోగించేవారు. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చేది. కాని ఇప్పుడు పాత CFL బల్బుల స్థానంలో LED బల్బులు వచ్చేశాయి. అయితే LED బల్బుల్లో కూడా నాణ్యమైనవి, బ్రాండెడ్ కంపెనీవి వాడితే 50% వరకు కరెంటు ఆదా అవుతుంది.

35
5-స్టార్ రేటింగ్ పరికరాలే వాడండి

సాధారణంగా చాలా మంది ధర తక్కువగా ఉందని నాసిరకం ఏసీలు, ఫ్రిడ్జ్ లు, వాటర్ హీటర్లు లాంటి ఎలక్ట్రికల్ పరికరాలు వాడుతుంటారు. ఇవి మీకు తెలియకుండా మీ కరెంట్ బిల్లు రెట్టింపు వచ్చేలా చేస్తాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టీవీల లాంటి వాటిని కొనేటప్పుడు 5-స్టార్ రేటింగ్ ఉన్న వాడితే మీ ఇంటి కరెంట్ బిల్లు సగానికి పైగా తగ్గిపోతుంది. 

45
అనవసర స్విచ్ లు ఆపేయండి

ప్రతి నెలా బిల్లు ఎక్కువగా వస్తోందంటే కారణాలు గుర్తించండి. అనవసరంగా ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నా, లైట్లు వెలుగుతూ ఉన్నా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు, ఛార్జింగ్ వెహికల్స్, ఛార్జింగ్ లైట్లు, ఇతర ఛార్జింగ్ పరికరాలను ఒకేసారి ఛార్జింగ్ పెట్టకండి. ఛార్జర్స్ ప్లగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేసి వదిలేయకండి. వాటర్ ట్యాంకులోని నీరు ఎక్కించేటప్పుడు టైమర్ ఉపయోగించడం ద్వారా ఆటోమెటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది. కరెంట్ ఆదా అవుతుంది.

55
సోలార్ ప్యానల్స్ వాడండి

ఇంటికి సోలార్ పవర్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది వెనకడుగు వేస్తారు. సోలార్ ప్యానల్స్ ఇన్ స్టాల్ చేసినప్పుడు మాత్రమే కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి. కాని ప్రతి నెలా కరెంట్ వాడుకోగా ఇంకా మిగులుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాల ద్వారా మీ ఇంటికి ప్యానెల్స్ ఇన్ స్టాల్ చేయించుకుంటే మీకు అవసరమైన కరెంట్ వాడుకోవడంతో పాటు ప్రభుత్వానికే తిరిగి అమ్ముకోవచ్చు. దీని వల్ల ఆదాయం కూడా పొందొచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories