Recharge plan: ఒక్క‌సారి రీఛార్జ్ 200 రోజులు బిందాస్‌.. రోజూ 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , OTT

Published : Dec 26, 2025, 10:17 AM IST

Recharge plan: టెలికం రంగంలో స‌రికొత్త విప్ల‌వంలా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ జియో. మంచి, మంచి రీఛార్జ్ ప్లాన్స్‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే జియో తాజాగా మ‌రో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
ఒక్క రీఛార్జ్‌… 200 రోజులు టెన్షన్‌ ఫ్రీ

టెలికాం రేట్లు పెరుగుతున్న ఈ సమయంలో లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ అవసరాన్ని గుర్తించిన రిలయన్స్ జియో, వినియోగదారులను ఆకట్టుకునే సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే దాదాపు ఆరు నెలలకు పైగా సిమ్ యాక్టివ్‌గా ఉండేలా ఈ ప్లాన్ రూపొందించారు.

25
జియో రూ.2025 ప్లాన్‌ ప్రధాన ఆకర్షణ

జియో తీసుకొచ్చిన రూ.2025 రీఛార్జ్ ప్లాన్‌లో మొత్తం 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ కాలం సిమ్ యాక్టివ్‌గా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. దీర్ఘకాల వ్యాలిడిటీతో పాటు అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ రూపొందించారు.

35
కాలింగ్, ఎస్ఎంఎస్‌ సౌకర్యాలు

ఈ ప్లాన్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాలింగ్ సదుపాయం ల‌భిస్తుంది. దేశవ్యాప్తంగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా మాట్లాడుకోవచ్చు. దీనికి తోడు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. కాలింగ్ ఎక్కువగా ఉపయోగించే యూజర్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

45
డేటా యూజర్లకు బెస్ట్ ప్లాన్

ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా చేసే వారికి ఈ ప్లాన్ బాగా సెట్ అవుతుంది. మొత్తం 500 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు సగటున 2.5 జీబీ డేటా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటా సౌకర్యం కూడా పొందవచ్చు. వర్క్ ఫ్రం హోం చేసే వారు, ఆన్‌లైన్ స్టడీ, వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

55
ఓటిటి, ఏఐ సర్వీసులు ఉచితంగా

డేటా, కాలింగ్‌తో పాటు ఈ ప్లాన్‌లో అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. గూగుల్ జెమినీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ మూడు నెలల పాటు అందుతుంది. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సేవలను కూడా అదనపు ఖర్చు లేకుండా వినియోగించుకోవచ్చు. ఒకే ప్లాన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీ రెండూ కలిసివస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories