Credit Card: లైఫ్ టైమ్ నో ఫీ, క్యాష్‌బ్యాక్‌లు.. ఇన్ని ఇచ్చినా క్రెడిట్ కార్డుల‌తో బ్యాంకులు ఏంటీ లాభం.?

Published : Dec 25, 2025, 02:30 PM IST

Credit Card: ఒక‌ప్పుడు క్రెడిట్ కార్డులు కొంద‌రి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి ద‌గ్గ‌ర కార్డులు ఉంటున్నాయి. అయితే బ్యాంకుల‌కు క్రెడిట్ కార్డుల‌తో లాభ‌మేంటో ఎప్పుడైనా ఆలోచించారా.?

PREV
15
క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులు ఎందుకు వెంటపడతాయి?

మాల్‌లు, షాపింగ్ సెంటర్లు, ఫోన్ కాల్స్… ఎక్కడ చూసినా క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కనిపిస్తాయి. “ఫ్రీ కార్డ్”, “లైఫ్‌టైమ్ నో ఫీ”, “క్యాష్‌బ్యాక్” అంటూ బ్యాంకులు ఆకర్షిస్తుంటాయి. అసలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా.? దానికి స‌మాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

25
వేగంగా పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ వినియోగం

భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. క్రెడిట్ కార్డ్ ఉంటే వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొనుగోలు చేసిన తర్వాత సుమారు 45 రోజుల వరకు బిల్ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. టైమ్‌కు బిల్ చెల్లిస్తే క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. వినియోగదారుడికి సౌకర్యం లభిస్తుంది. బ్యాంకులకు మాత్రం దీర్ఘకాల ఆదాయం వస్తుంది. అందుకే ఎక్కువ మందికి క్రెడిట్ కార్డులు ఇవ్వాలని బ్యాంకులు ప్రయత్నిస్తాయి.

35
క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకుల ఆదాయం ఎలా వస్తుంది?

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2025 ప్రారంభానికి దేశంలో యాక్టివ్ క్రెడిట్ కార్డులు 11 కోట్లకు పైగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ బ్యాంకులకు ఒక పూర్తి వ్యాపార మోడల్ లాంటిది. బిల్ సమయానికి చెల్లించకపోతే 15 శాతం నుంచి 40 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. దీనితో పాటు బ్యాంకులు వార్షిక రీన్యూవల్ ఫీజు, లేట్ పేమెంట్ ఫీజు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు, EMI కన్వర్షన్ ఫీజు వంటి వాటి ద్వారా బ్యాంకులకు పెద్ద మొత్తంలో లాభం వస్తుంది.

45
ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఏమిటి?

మీరు క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు బ్యాంకు ఆ షాప్ యజమానితోనూ డబ్బు వసూలు చేస్తుంది. ట్రాన్సాక్షన్ విలువలో 1 శాతం నుంచి 3 శాతం వరకు కమిషన్ తీసుకుంటుంది. దీనినే ఇంటర్‌చేంజ్ ఫీజు అంటారు. అంటే కస్టమర్ నుంచి మాత్రమే కాదు, వ్యాపారి నుంచి కూడా బ్యాంకుకు ఆదాయం వస్తుంది.

క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే ఎందుకు నష్టం?

క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే దానిని క్యాష్ అడ్వాన్స్ అంటారు. ఈ సౌకర్యం చాలా ఖరీదైనది. డబ్బు తీసుకున్న వెంటనే 2.5 శాతం నుంచి 5 శాతం వరకు ఫీజు కట్ చేస్తారు. అంతేకాదు అదే రోజు నుంచి వడ్డీ లెక్కింపు మొదలవుతుంది. గ్రేస్ పీరియడ్ ఉండదు. ఉదాహరణకు మీరు రూ.10,000 తీసుకుంటే 3 శాతం ఫీజు అంటే వెంటనే రూ.300 బ్యాంకుకు వెళ్తుంది. దానిపై వడ్డీ అదనం.

55
బ్యాంకుల‌కు లాభాలు

2025 జనవరిలో క్రెడిట్ కార్డ్ ఖర్చు 10.8 శాతం పెరిగి రూ.1.84 ట్రిలియన్‌కు చేరింది. రివార్డ్స్, క్యాష్‌బ్యాక్, ట్రావెల్ డిస్కౌంట్లు ప్రజలను ఎక్కువగా ఖర్చు చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. సరైన విధంగా బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. భవిష్యత్తులో లోన్లు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే తప్పుగా వాడితే అప్పుల బాట పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆర్‌బీఐ నిబంధనలు కఠినతరం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories