ప్రియాంక చోప్రా నుండి విరాట్ కోహ్లీ వరకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుండి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

First Published Jul 2, 2021, 6:05 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్  ఇన్‌స్టాగ్రామ్ 2021 రిచ్‌లిస్ట్‌ను విడుదల చేసింది. hopperhq.com ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం ప్రియాంక చోప్రా పెయిడ్ పోస్ట్ ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తుంది. ఈ జాబితాలో  విరాట్ కోహ్లీ పేరు కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఒక్క పెయిడ్ పోస్ట్ ద్వారా సుమారు రూ.5   కోట్లు  సంపాదిస్తున్నాడు.

టాప్ 30లో ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ పేర్లుఈ జాబితాలో ప్రియాంక చోప్రా 27వ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీకి 19వ ర్యాంక్ లభించింది. ఈ ఇద్దరు భారతీయ స్టార్లు వరుసగా 3 సంవత్సరాలుగా తమ ర్యాంకింగ్‌ను పెంచుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో కేవలం ఇద్దరు భారతీయుల పేర్లు మాత్రమే ఉన్నాయి.అయితే ఈ జాబితాలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. అతను పెయిడ్ పోస్టుకు రూ .11.9 కోట్లు సంపాదిస్తున్నారు. డ్వేన్ జాన్సన్ రెండవ స్థానంలో, సింగర్ అరియానా గ్రాండే మూడవ స్థానంలో నిలిచారు.
undefined
జూన్ 2012లో ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి తాను నవ్వుతున్న ఫోటోతో ఈ ప్లాట్‌ఫాం ప్రారంభించింది. ఫోటో తో పాటు- I AM HAPPY TO HERE- అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ఐ‌డి @priyankachoprajonas
undefined
ప్రియాంక చోప్రాఫాలోవర్స్ : 65 మిలియన్లు అంటే 6.5కోట్లుఫాలోయింగ్ : 606మొత్తం పోస్ట్లు: 3373
undefined
తాజాగా ప్రియాంక చోప్రా తన రెస్టారెంట్ ఫోటోని పోస్ట్ చేసింది. కొంతకాలం క్రితం ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో ఒక భారతీయ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసి దానికి సోనా అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే భారతీయ అభిరుచిని, సంస్కృతిని విదేశాలలో ప్రోత్సహించినందుకు ప్రియాంకను చాలా మంది ప్రశంసించారు కూడా. ఇటీవల ప్రియాంక మొదటిసారి ఈ రెస్టారెంట్‌ సందర్శించి అక్కడ గొల్గప్పను తిని ఆస్వాదించింది.
undefined
ప్రియాంక చోప్రా చివరిసారిగా 'ది వైట్ టైగర్' లో సినిమాలో నటించింది. ఈ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ కూడా లభించింది. ఆమె రాబోయే సినిమాలు మిండీ కాలింగ్‌ కాకుండా 'టెక్స్ట్ ఫర్ యు', 'మ్యాట్రిక్స్ 4' కూడా నటించనున్నారు.
undefined
click me!