Bank Fraud: ఆ బ్యాంకులో భారీ మోసం, మనీ ట్రాన్సాక్షన్స్ ఆపేయన్న ఆర్బీఐ

Published : Feb 16, 2025, 06:24 PM IST

Bank Fraud: డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులే సేఫ్ అని అనుకుంటాం కదా.. కాని బ్యాంకుల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ బ్యాంకులో మేనేజర్ మరికొందరు కలిసి కస్టమర్ల డబ్బును దోచేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఎంత డబ్బు పోయిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
14
Bank Fraud: ఆ బ్యాంకులో భారీ మోసం, మనీ ట్రాన్సాక్షన్స్ ఆపేయన్న ఆర్బీఐ

బ్యాంకుల పనితీరు ఎలా ఉంటుందంటే.. లోన్స్ ఇచ్చేటప్పుడు వడ్డీ ఎక్కువ వసూలు చేస్తారు. డిపాజిట్ల ద్వారా సేవింగ్స్ చేసుకొనే వారికి మాత్రం తక్కువ వడ్డీ ఇస్తారు. దీనికి కారణం లేకపోలేదు. లోన్ తీసుకున్న వారు ఎగ్గొడితే నష్టాలు భరించాలన్న ముందు జాగ్రత్తగా వడ్డీ రూపంలోనే ఎక్కువ వసూలు చేసేస్తారు. నిజాయితీగా ఉండే వారు మాత్రం మోసం చేయకూడదన్న ఉద్దేశంతో ఈఎంఐలు సక్రమంగా కట్టేస్తారు. 

24

కాని బ్యాంకుల్లో పనిచేసే వారే కస్టమర్ల కష్టార్జితాన్ని దోచేస్తే ఇక ఎవరిని నమ్మాలి. సరిగ్గా ఇదే సంఘటన మహరాష్ట్రలోని ముంబైలో ఇటీవల చోటుచేసుకుంది. గత ఫిబ్రవరి 13న ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ బ్యాంకులో ఎవరూ ఎలాంటి లావాదేవీలు చేయవద్దని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు, మోసగాళ్లతో జాగ్రత్త: RBI హెచ్చరిక

34

ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ భారీ మొత్తాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతనితో పాటు మరొకరు ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 316(5), 61(2) కింద కేసు నమోదు చేశారు. ఈ బ్యాంకులో ఈ భారీ కుంభకోణం 2020 నుంచి 2025 వరకు జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ భారీ కుంభకోణం ఎలా జరిగింది? ఈ ఘటనలో ఎవరెవరున్నారు అనేది తెలుసుకునేందుకు ‘ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్’కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

44

ఆర్బీఐ దర్యాప్తు

బ్యాంకు భద్రతా విధానాలు ఉల్లంఘించారన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్యాంకు గత రెండేళ్ల ఆర్థిక నివేదిక కూడా వెలుగులోకి వచ్చింది. గత 2023లో రూ.31 కోట్ల నష్టం వచ్చినట్లు అందులో ఉంది. అంతేకాదు 2024 మార్చి నాటికి రూ.23 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిసింది. ఈ భారీ మోసాన్ని గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకులో ఎవరూ డబ్బులు డిపాజిట్ చేయవద్దని, దర్యాప్తు తేలేదాకా డ్రా చేయవద్దని సూచించింది. 

click me!

Recommended Stories