Gold Prices: బంగారం కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. గోల్డ్ ధర ఎంత తగ్గిందో తెలుసా?

Published : Feb 16, 2025, 11:19 AM IST

Gold Prices: ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులోనూ పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు. బంగారం ధర ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Gold Prices: బంగారం కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. గోల్డ్ ధర ఎంత తగ్గిందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి వరకు గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక అంశాలు కారణం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడం, తర్వాత ఆయన వివిధ దేశాలపై ట్యాక్సుల గురించి మాట్లాడటం తదితర కారణాలతో బంగారం ధరలు రోజురోజుకూ పెరగడం జరిగింది. 
 

25

అయితే ఊహించని విధంగా ఇప్పుడు బంగారం ధరలు తగ్గాయి. ఇది గోల్డ్ కొనాలనుకొనే వారికి చాలా మంచి అవకాశం. బంగారం కొనాలనుకుంటే వెంటనే కొనడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో మళ్లీ గోల్డ్ రేట్లు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 
 

35

బంగారం ధరలు ఎందుకు తగ్గాయి 
అమెరికా డాలర్ బలపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారి బంగారంపై ఇన్వెస్ట్ మెంట్పై ప్రభావితం చూపాయి.

భారతదేశంలో ఆభరణాల కొనుగోలు తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా వివాహ సీజన్లలో కూడా బంగారు ఆభరణాలపై డిమాండ్ తగ్గడం ధరలపై ప్రభావం చూపిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

45

హైదరాబాద్‌లో బంగారం ధరలు (16 ఫిబ్రవరి 2025):
22 క్యారెట్ల బంగారం: 1 గ్రాము ధర రూ.7,890; 10 గ్రాముల ధర రూ.78,900.
24 క్యారెట్ల బంగారం: 1 గ్రాము ధర రూ.8,607; 10 గ్రాముల ధర రూ.86,070.

ఫిబ్రవరి 14న 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.7,990 ఉండగా, ఫిబ్రవరి 15న అది రూ.7,890కి తగ్గింది. ఫిబ్రవరి 16న కూడా అదే ధర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, దేశీయ డిమాండ్, ఆర్థిక విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

55

భవిష్యత్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని, 2025లో ధరలు రూ.90,000కు చేరుకోవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. పెట్టుబడిదారులు తాజా మార్కెట్ ట్రెండ్స్‌ను గమనించి, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వెండి ధరలు ఎలా ఉన్నాయి. 

వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.945.41, 100 గ్రాముల ధర రూ.9,454.09, 1 కిలో ధర రూ.94,541 గా ఉంది.
 

click me!

Recommended Stories