సామాజిక కట్టుబాట్లను తెంచుకుంటూ మహిళలు పురుషులకు పోటీగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్న మహిళలు మద్యం తాగడంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5), 2019-20 డేటా ఆధారంగా మహిళలు ఎక్కువగా మద్యం తాగే ఏడు రాష్ట్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం తాగడం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో మద్యం తాగడం నిషేధం. అలాగే రాష్ట్రాల వారీగా ఆల్కహాల్ వినియోగం వేరుగా ఉంటుంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ మంది మహిళలు మద్యపానానికి బానిసలుగా మారుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. దీని ప్రకారం ఏ రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయో చూద్దాం.