మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 6 ఉదయం 9.22 గంటలకు గోల్డ్ కాంట్రాక్టులు 0.12 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 47,960కి చేరుకున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోగ్రాముకు 0.3 శాతం పెరిగి రూ.61,699కి చేరాయి.
"మేము బులియన్లలో భారీ అస్థిరతను చూస్తున్నాము, ఇది డిసెంబర్ నెలలో కొనసాగవచ్చు. టెక్నికల్ చార్ట్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ ఓవర్‌సోల్డ్ జోన్‌లో ట్రేడింగ్ అవుతున్నాయి, మొమెంటం ఇండికేటర్ RSI కూడా గంట(hour) అండ్ డైలీ చార్ట్‌లో అదే సూచిస్తుంది. ప్రస్తుత స్థాయిలు స్వల్పకాలిక పెట్టుబడిదారులకు ఉత్తమ ధరలు”అని అమిత్ ఖరే AVP- రీసెర్చ్ కమోడిటీస్, గంగానగర్ కమోడిటీ అన్నారు.
గత సెషన్‌లో బంగారం 1% లేదా 10 గ్రాములకు రూ.550 పెరిగింది, వెండి కిలోకు 0.73% లేదా రూ.444 పెరిగింది .
ఫిబ్రవరి గోల్డ్ క్లోసింగ్ ప్రైస్ రూ. 47,903, సపోర్ట్ 1 - రూ. 47,750, సపోర్ట్ 2 - రూ. 47,500, రెసిస్టెన్స్ 1 - రూ. 48,150, రెసిస్టెన్స్ 2 - రూ. 48,500.
మార్చి సిల్వర్ క్లోసింగ్ ప్రైస్ రూ. 61,516, సపోర్ట్ 1 - రూ. 60,900, సపోర్ట్ 2 - రూ. 60,500, రెసిస్టెన్స్ 1 - రూ. 62,130, రెసిస్టెన్స్ 2 - రూ. 63,000.