వెంటాడుతున్న ఓమిక్రాన్ భయాలు.. స్టాక్ మార్కెట్ తో సహ క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా క్రాష్..

First Published Dec 4, 2021, 6:17 PM IST

నేడు శనివారం మరోసారి కరెన్సీ మార్కెట్‌లో కలకలం చెలరేగింది. దీంతో పలు క్రిప్టోకరెన్సీ(cryptocurrency)ల ధరలో పతనాన్ని నమోదు చేశాయి. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ (digital currency)బిట్‌కాయిన్ (bitcoin)ధర సుమారు 16 శాతం పడిపోయింది. మరోవైపు ఎథెరియం, డాడ్జ్‌కాయిన్, పోల్కాడోట్‌తో సహా టాప్ కరెన్సీలు కూడా ఘోరంగా పడిపోయాయి.

బిట్‌కాయిన్
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ $43 వేల స్థాయిలో 16 శాతం క్షీణించింది. ఈ క్షీణతతో డిజిటల్ కరెన్సీ $44,000 కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి పరంగా చూస్తే శనివారం రూ.35 లక్షల స్థాయికి దిగువకు చేరింది. అయితే కొంత కాలం తర్వాత అందులో కాస్త మెరుగుపడటంతో దీని ధర రూ.39 లక్షలకు పెరిగింది. అలాగే నిన్నటి వరకు  వరకు 13 శాతానికి పైగా బలహీనతతో ట్రేడవుతోంది. 
 

నవంబర్‌లో ఆల్-టైమ్ హై
 బిట్‌కాయిన్ ఈ ఏడాది నవంబర్‌లో ఆల్-టైమ్ హైని తాకింది. నవంబర్ 10న ఈ డిజిటల్ కరెన్సీ విపరీతమైన విజృంభణతో $69,000ను తాకింది. కానీ ఈ స్థాయికి చేరినప్పటి నుండి ఇప్పటివరకు పడిపోతునే కొనసాగుతూ ఉంది. 

ఎథెరియం కూడా చాలా క్లిష్ట స్థితిలో 
క్రిప్టోకరెన్సీ మార్కెట్లో పెట్టుబడిదారుల ఇష్టమైన రెండవ టాప్ కరెన్సీ ఎథెరియం కూడా భారీ క్షీణతను చూస్తోంది. బిట్‌కాయిన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన ఎథెరియం (Ethereum) ధర శనివారం నాడు 13.73 శాతం తగ్గి రూ. 3,934.86కి చేరుకుంది. ముఖ్యంగా ఎథెరియం నవంబర్‌లో ఆల్-టైమ్ హైని కూడా తాకింది. 

ఇతర డిజిటల్ కరెన్సీలలో పతనం
ఇతర ప్రధాన డిజిటల్ కరెన్సీలో క్షీణత గణాంకాలను పరిశీలిస్తే బినాన్స్ కాయిన్ 12.59 శాతం, పోల్కాడోట్ 28.23 శాతం, డాడ్జ్‌కాయిన్ 19.42 శాతం, షిబా ఇను 14.06 శాతం, లైట్ కాయిన్ 24.41 శాతం తగ్గాయి. అంతేకాకుండా కార్డానో, రిపుల్ అండ్ యూనిస్వాప్‌తో సహా ఇతర కరెన్సీలు క్షీణతతో ట్రేడవుతున్నాయి.     
 

నిపుణుల అభిప్రాయం ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ -19  కొత్త ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దీనికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లపై కనిపించగా ఇప్పుడు క్రిప్టో మార్కెట్‌పై కూడా దీని నీడ కనిపిస్తోంది.

భారతదేశంలో క్రిప్టోకరెన్సీ బిల్లు 
క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లు త్వరలో భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి విడుదలైన నివేదికల ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వచ్చే వారం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టవచ్చు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నిర్వహణే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువస్తున్నారు. దేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే సూచనలు కూడా ఉన్నాయి. 

click me!