గృహ, వాహన రుణగ్రహీతలకు నో రిలీఫ్.. యదాతధంగా వడ్డీ రేట్లను కోనసాగించిన ఆర్‌బి‌ఐ..

First Published Oct 8, 2021, 12:54 PM IST

 న్యూఢిల్లీ: గృహ, వాహన రుణగ్రహీతలకు మళ్ళీ నిరాశే ఎదురైంది.  ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం మానేటరీ పాలసీ  రివ్యూలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీంతో ప్రస్తుత ఈ‌ఎం‌ఐ ధరలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. 
 

అక్టోబర్ 8న అంటే  నేడు సెంట్రల్ బ్యాంక్   మానేటరీ పాలసీ  రివ్యూ ఫలితాలను ప్రకటించింది. ఇందులో  రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. రేపో అనేది ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు అందించే నిధుల  ధర.  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్ ఉపయోగించే ఒక సాధనం. రివర్స్ రెపో రేటు అంటే ఆర్‌బి‌ఐ బ్యాంకుల నుండి తీసుకునే అప్పు రేటు.
 

rbi announcement, rbi, bank holiday, corona pandemic

ఎం‌పి‌సి చివరి ఏడు రివ్యూలలో కీ బెంచ్‌మార్క్ ధరలను యథాతథంగా ఉంచింది. పాలసీ రేటును యథాతథంగా ఉంచాలని ఎం‌పి‌సి నిర్ణయించడం వరుసగా ఎనిమిదోసారి. చారిత్రక కనిష్టానికి వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా డిమాండ్ పెంచడానికి ఆర్బీఐ చివరిసారిగా 22 మే 2020న పాలసీ రేటును సవరించింది.

6-సభ్యులతో కూడిన  ఎం‌పి‌సి వడ్డీ రేటును యథాతథంగా ఉంచడానికి ఏకగ్రీవంగా ఓటు వేసింది. వృద్ధికి మద్దతుగా ఇంకా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా అవసరమైనంత వరకు అనుకూల వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకుంది.

Latest Videos


ఆర్‌బిఐ సిపిఐ ద్రవ్యోల్బణం 2021-22 సమయంలో 5.7 శాతంగా అంచనా వేసింది. రెండవ త్రైమాసికంలో 5.9 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.3 శాతంగా, ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతంగా, నష్టాలు విస్తృతంగా సమతుల్యం చేయబడ్డాయి. 2022-23 మొదటి త్రైమాసికంలో సిపిఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా అంచనా వేసింది.

ఆగస్టులో సిపిఐ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం డేటాను అక్టోబర్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు.

click me!