పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేదెలే.. నేడు సరికొత్త రికార్డు స్థాయికి ఇంధన ధరలు..

First Published Oct 8, 2021, 11:37 AM IST

నేడు దేశ వ్యాప్తంగా ఇంధన  ధరలు భగ్గుమన్నాయి. ఒక వైపు మెట్రో నగరాలతోపాటు మిగతా అన్నీ నగరాల్లో  పెట్రోల్ ధర తార స్థాయికి చేరింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను  ఈరోజు శుక్రవారం మళ్ళీ సవరించాయి. 

నేడు డీజిల్ ధర 34 నుండి 37 పైసలు పెరగగ,పెట్రోల్ ధర 26 నుండి 30 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు చేస్తుంటాయి.
 

నేడు ప్రధాన మెట్రో నగరాలలో  ఇంధన  ధరలు..
నగరం    డీజిల్    పెట్రోల్
ఢిల్లీ    92.12    103.54 
ముంబై    99.92     109.54 
కోల్‌కతా    95.23     104.23 
చెన్నై    96.60    101.01
(పెట్రోల్-డీజిల్ ధర లీటరుకు రూపాయిల్లో ఉంది.) 

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.71గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 100.51గా ఉంది. స్థానిక పన్నుల పరిధిని బట్టి ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. నేటి పెరుగుదలతో ఇంధన  ధరలు సరికొత్త రికార్డు గరిష్టానికి చేరింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓ‌ఎం‌సిలు) జూలై 18 నుండి సెప్టెంబర్ 23 వరకు ధరల పెంపును చేపట్టలేదు. అంతే కాకుండా పెట్రోల్ ధర లీటరుకు 0.65, డీజిల్ రూ.1.25 తగ్గించబడింది. 
 

బ్రెంట్ ఫ్యూచర్స్ 87 సెంట్లు అంటే 1.1%పెరిగి బ్యారెల్‌కు  81.95 డాలర్ల వద్ద స్థిరపడగా, యూ‌ఎస్ క్రూడ్ 87 సెంట్లు అంటే 1.1% పెరిగి బ్యారెల్ 78.30 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజున ఈ రెండు బెంచ్‌మార్క్‌ల ధరలు బ్యారెల్‌కు   2 డాలర్లకు తగ్గాయి.

ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది,
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. 

మీ నగరంలో
పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తేలుసుకోవడానికి మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మీరు ఆర్‌ఎస్‌పి, మీ సిటీ కోడ్ వ్రాసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్‌ఎం పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

లేదా ఇక్కడ చెక్ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటారు. కొత్త ధరకు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్,  డీజిల్ ధరలను సమీక్షిస్తాయి.  

click me!