వావ్.. పెట్రోల్ ధర లీటరుకు 3 రూపాయలే.. ఎక్కడో తెలుసా ?

First Published Oct 7, 2021, 5:24 PM IST

 భారతదేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న  ఇంధన  ధరలపై  సామాన్యులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వాహనదారులు పెట్రోల్, డీజిల్ బేస్ ధర కంటే దాదాపు మూడు రెట్లు చెల్లిస్తున్నారు.
 

నేడు వరుసగా రెండవ రోజు కూడా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో ఈ రోజు డీజిల్ ధర 35 నుండి 38 పైసలు, పెట్రోల్ ధర 26 నుండి 30 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.24 కాగా, డీజిల్ ధర రూ. 91.77. ముంబైలో పెట్రోల్ ధర రూ. 109.25, డీజిల్ ధర రూ. 99.55.

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 103.94 కాగా, డీజిల్ ధర రూ. 94.88. చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ .100.75, డీజిల్ రూ .96.26.  రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్న  పెట్రోల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు భారతదేశంలో రికార్డు స్థాయికి చేరినప్పటికి  ప్రపంచంలోని కొన్ని దేశాలలో  పెట్రోల్ లీటర్‌కు రూ.3 కంటే తక్కువ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధర చౌకైన, అత్యంత ఖరీదైన దేశాల గురించి తెలుసుకుందాం..

ఈ దేశాల్లో  పెట్రోల్  అత్యంత చౌకగా లభిస్తుంది
వెనిజులా -   2.9 రూపాయలు  ($ 0.040)
ఇరాన్ -  4.48 రూపాయి ($ 0.060)
సిరియా - 17.26 రూపాయలు ($ 0.231)
అంగోలా - 19.98 రూపాయలు ($ 0.267)
అల్జీరియా - 25.11 రూపాయలు ($ 0.336)
 

ఈ దేశాల్లో పెట్రోల్ అత్యంత ఖరీదైనది
హాంకాంగ్ - 191.85 రూపాయలు ($ 2.567)
నెదర్లాండ్స్ - రూ. 161.82 ($ 2.164)
నార్వే - రూ. 161.15 ($ 2.155)
సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ - 158.98 రూపాయలు ($ 2.126)
ఇజ్రాయెల్ - 153.15 రూపాయలు ($ 2.048)
 

ఈ ధరలు 4 అక్టోబర్ 2021 నాటివి
సోర్స్ : Globalpetrolprices.com

భారతదేశం గురించి మాట్లాడితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో పెట్రోల్ ధర రూ .100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది.

click me!