సిబిల్ స్కోర్ లేదా ? ఈ క్రెడిట్ కార్డ్‌తో మీ స్కోర్‌ ఈజీగా పెరిగిపోతుంది

First Published | Jun 20, 2024, 1:34 PM IST

మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ? కానీ మంచి CIBIL స్కోర్ లేకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్  ఇవ్వలేవు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ ని సాధారణంగా బ్యాంకులు  ఆన్సెక్యూర్డ్(unsecured)గా  వర్గీకరిస్తాయి. కాబట్టి, CIBIL స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటేనే క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. కానీ మంచి క్రెడిట్ స్కోర్ లేని వారు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ద్వారా CIBIL స్కోర్‌ పెంచుకోవచ్చు. ఏంటంటే బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరిచి గ్యారంటీ ఇవ్వడం ద్వారా క్రెడిట్ కార్డ్ పొందే ఒక మార్గం ఉంది.

ఇలాంటి క్రెడిట్ కార్డులను సెక్యూర్డ్(secured) క్రెడిట్ కార్డ్స్ అంటారు. ఈ క్రెడిట్ కార్డ్‌ని తీసుకున్న తర్వాత, వాడిన  మొత్తాన్ని ఖచ్చితంగా తిరిగి చెల్లించడం ద్వారా CIBIL స్కోర్‌ను పెంచుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డుల లిమిట్ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 75 శాతం నుండి 90 శాతం వరకు  ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత కిరాణా సామాగ్రి కొనుగోళ్లు, బిల్లు పేమెంట్లు, వైద్య ఖర్చులు, ఆన్‌లైన్ షాపింగ్, హోటల్ & రెస్టారెంట్స్ ఫుడ్స్  ఇతర  సాధారణ ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చిన తర్వాత 100% తిరిగి చెల్లించేలా చూసుకోండి. ఇలా ప్రతి నెలా సరిగ్గా పాటిస్తే CIBIL స్కోర్ పెరుగుతుంది. అయితే గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు క్రిడిట్ కార్డు బిల్ తేదీలోపు ప్రతినెలా బిల్లును కట్టకపోతే బ్యాంకు ఈ మొత్తాన్ని సెక్యూరిటీగా ఇచ్చిన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి కట్  చేస్తుంది.  
 

Latest Videos


సెక్యూర్డ్  క్రెడిట్ కార్డ్‌ మొదటిసారి క్రెడిట్ కార్డ్ తీసుకునేవారికి మంచి CIBIL స్కోర్‌ను మెయింటైన్ చేయడంలో సహాయపడటమే కాకుండా  గతంలో డిఫాల్ట్ గా  ఉన్నవారికి క్రెడిట్ స్కోర్‌ పెంచుకోవడానికి సహాయపడతాయి. మీరు గతంలో ఏదైనా లోన్  లేదా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌ కట్టకుండా డిఫాల్ట్ చేసి ఉంటే, అది మీ CIBIL స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. 

దింతో  బ్యాంకులు క్రెడిట్ కార్డు లేదా మరేదైనా లోన్ ఇవ్వడానికి ఇష్టపడదు. ఈ సమస్యలని అధిగమించడానికి సెక్యూర్డ్(secured)  క్రెడిట్ కార్డ్ చాలా సహాయంగా, ఉపయోగంగా కూడా ఉంటుంది.

click me!