ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? ఫార్మ్ నింపే ముందు ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

First Published | Jun 20, 2024, 12:04 PM IST

ఆధార్ కార్డు ఎన్‌రోల్ చేయడానికి లేదా అప్‌డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. దీని కోసం UIDAI కొత్త ఫార్మ్స్ షేర్ చేసింది. UIDAI నాన్ రెసిడెంట్స్ అండ్  రెసిడెంట్స్ కోసం ఆధార్ కార్డ్‌ను ఎన్‌రోల్ చేయడానికి, అప్‌డేట్ చేయడానికి వేర్వేరు ఫారమ్‌లను తీసుకొచ్చింది. UIDAI  ఈ కొత్త మార్గదర్శకాలు ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడం లేదా ఎన్‌రోల్ చేయడం మొత్తం ప్రక్రియను ఈజీ చేయాలనే లక్ష్యంతో  రూపొందించింది.
 

కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు సమీపంలోని ఆధార్ సర్వీస్  సెంటర్‌కి వెళ్లడం ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డ్ సమాచారాన్ని సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (CIDR)లో అప్‌డేట్ చేయవచ్చు.

పాత 2016 చట్టం ప్రకారం, ఆధార్ కార్డ్ హోల్డర్ వారి అడ్రస్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్‌డేట్ చేయగలరు. ఏవైనా ఇతర వివరాలను అప్‌డేట్ చేయడానికి  మీ సమీపంలోని ఎన్రోల్మెంట్  సెంటర్ ను సందర్శించాల్సి ఉంటుంది.
 

ఫార్మ్ 1
దేశంలోని నివాసితులు, నాన్-రెసిడెంట్స్ ఆధార్ కార్డ్ ఎన్‌రోల్‌మెంట్ కోసం  ఫార్మ్ 1ని ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తికి ఇప్పటికే ఆధార్ కార్డ్ ఉంటే ఇతర వివరాలను అప్‌డేట్ చేయడానికి కూడా ఫార్మ్ 1ని ఉపయోగించవచ్చు

ఫార్మ్ 2
ఇండియా కాకుండా విదేశాల్లో అడ్రస్ ప్రూఫ్ ఉన్న NRIల కోసం ఫార్మ్ 2ని తీసుకొచ్చారు. ఎన్రోల్మెంట్ అండ్  అప్ డేట్ కోసం ఫారమ్ 2 ఉపయోగించవచ్చు.

Latest Videos


ఫార్మ్ 3
5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల నమోదు కోసం ఫార్మ్ 3 ఉపయోగించవచ్చు, కానీ 18 సంవత్సరాల మించకూడదు.

ఫార్మ్ 4
ఇండియా  కాకుండా విదేశాల్లో అడ్రస్ ప్రూఫ్ ఉన్న NRI పిల్లల కోసం ఫార్మ్ 4ని ఉపయోగించాలి.
 

ఫార్మ్ 5
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్‌ కోసం లేదా అప్‌డేట్ చేయడానికి ఫారమ్ 5ని ఉపయోగించాలి.

ఫార్మ్ 6
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న NRI పిల్లలు (భారతదేశం బయట అడ్రస్ ప్రూఫ్ ఉన్నవారు) ఫారమ్ 6ని ఉపయోగించాలి.

ఫార్మ్ 7
ఫార్మ్ 7ను 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విదేశీ పౌరులు.. ఆధార్ వివరాలను ఎంట్రీ  చేయాలనుకునే లేదా అప్‌డేట్ చేయాలనుకునే వారు ఉపయోగించవచ్చు.  ఈ కేటగిరీలో చేరడానికి విదేశీ పాస్‌పోర్ట్, OCI కార్డ్, వేలిడిటీ ఉన్న లాంగ్ స్టే వీసా, భారతీయ వీసా వివరాలు అవసరం.

ఫార్మ్ 8
ఫార్మ్ 8ని 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విదేశీ పౌరుల కోసం ఉపయోగించాలి. 

 ఫారం 9
18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ నంబర్‌ను క్యాన్సల్ చేయడానికి ఫారం 9ని ఉపయోగించవచ్చని UIDAI తెలియజేసింది.

click me!