సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఆర్‌బిఐ జారీ చేసిన దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది. భారతదేశంలో దీనిని డిజిటల్ రూపి అని కూడా పిలుస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి - రిటైల్ అండ్ హోల్ సేల్. రిటైల్ డిజిటల్ కరెన్సీని సాధారణ ప్రజలు, కంపెనీలు ఉపయోగిస్తాయి. అయితే, హోల్‌సేల్ డిజిటల్ కరెన్సీని ఆర్థిక సంస్థలు ఉపయోగిస్తాయి.