వివిధ ప్రాంతాల్లో వినియోగదారుల డిమాండ్, ఉత్పాదన, ప్రైసింగ్ ధోరణులను అర్థం చేసుకునేందుకు డేటా, సాంకేతికతల సమ్మేళనాన్ని కళారా ఉపయోగిస్తుంది. అంతేగాకుండా భారతీయ కళాత్మక వస్తువులకు మార్కెటింగ్, విక్రయ అవకాశాలను పెంచుకునేందుకు గాను ఆ సమాచారాన్ని తిరిగి కళాకారులకు అందిస్తుంది.
రిలయన్స్ అండతో కళారా, సరఫరా చెయిన్, సోర్సింగ్, ప్రోడక్ట్ డెవలప్ మెంట్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, డేటా సైన్సెస్, సాంకేతికతలను సమ్మిళితం చేస్తోంది. అది విశిష్టమైన బి2బి అంతర్జాతీయ సాంకేతిక వేదిక. వేలాది ఉత్పాదనలకు సంబంధించి మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ, ధరలు, లీడ్ టైమ్స్, సప్లయ్ చెయిన్ ఆవశ్యకతలు లాంటివాటిని ఇది వివిధ దేశాల వారీగా, వాయుమార్గం, సముద్రమార్గం పరిగణనలోకి తీసుకుంటూ లెక్కిస్తుంది. ఆర్డర్ పై తయారు చేయడం, కస్టమైజేషన్, సరైన సమయంలో పంపడం లాంటి పలు ఫుల్ ఫిల్ మెంట్ మోడల్స్ ను అందిస్తుంది. పలు రకాల అంతర్జాతీయ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.