అయ్యయ్యో వద్దమ్మ.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి..

Ashok Kumar   | Asianet News
Published : Oct 28, 2021, 12:34 PM IST

రెండు రోజుల విరామం తర్వాత బుధవారం  నుండి చమురు కంపెనీలు (oil companies)ఇంధన ధరల పెంపును కొనసాగించాయి. దీంతో ఇప్పటికే ఆకాశానికి తాకిన పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలు నేటి పెంపుతో రికార్డు స్థాయికి చేరాయి.  చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం మరోసారి దేశవ్యాప్తంగా ఇంధన ధరలను సవరించడంతో  సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.  నివేదికల ప్రకారం పౌర విమానాల్లో  అందించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనాని కంటే  ఇప్పుడు పెట్రోల్ ధర 37.07 శాతం అధికంగా చేరింది.   

PREV
15
అయ్యయ్యో వద్దమ్మ.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి..

భారతదేశంలో లీటరు పెట్రోల్ అత్యంత ధరతో  విక్రయిస్తున్నా ప్రదేశం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.120.52 . డీజిల్ ధర కూడా  అత్యధికంగా లీటరుకు  రూ.111.39కి చేరింది.

గత వారం భారతదేశంలో వరుసగా ఐదు రోజుల ఇంధన ధరల పెరుగుదలను చూసింది. ఆదివారం వరకు పెట్రోల్, డీజిల్  ధరలు లీటరుకు దాదాపు  రూ.2 పెరిగింది. గత నాలుగు వారాల్లో పెట్రోల్ ధర 21 సార్లు పెరిగింది, సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధర 24 సార్లు పెరిగింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర లీటరుకు  రూ.6.40, డీజిల్ ధర  లీటరుకు రూ.7.70 పెరిగింది.
 

25

హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ ధరల సవరణ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి: 

బెంగళూరు
పెట్రోల్ - రూ. 112.06
డీజిల్ - రూ. 102.98

చెన్నై (లీటరుకు)
పెట్రోల్ - రూ. 105.13
డీజిల్ - రూ. 101.25

కోల్‌కతా (లీటరుకు)
పెట్రోల్ - రూ. 108.78
డీజిల్ - రూ. 100.14

35

ముంబై (లీటరుకు)
పెట్రోల్ - రూ. 114.14
డీజిల్ - రూ. 105.12

ఢిల్లీ (లీటరుకు)
పెట్రోల్ - రూ. 108.29
డీజిల్ - రూ. 97.02

భోపాల్ (లీటరుకు)
పెట్రోల్ - రూ. 116.98
డీజిల్ - రూ. 106.38

హైదరాబాద్ (లీటరుకు)
పెట్రోల్ - రూ. 112.64
డీజిల్ - రూ. 105.84

గౌహతి (లీటరుకు)
పెట్రోల్ - రూ. 104.30
డీజిల్ - రూ. 96.87

లక్నో (లీటరుకు)
పెట్రోల్ - రూ. 105.22
డీజిల్ - రూ. 97.98

గాంధీనగర్ (లీటరుకు)
పెట్రోలు - రూ. 105.14
డీజిల్ - రూ. 104.78

తిరువనంతపురం (లీటరుకు)
పెట్రోల్ - రూ. 110.54
డీజిల్ - రూ. 104.25

45

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను పెంచడానికి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్ను కూడా ధరలు మూడు అంకెల మార్కును దాటడానికి ప్రధాన కారణం.

రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించేందుకు నిరాకరిస్తోంది. పన్నుల ద్వారా సేకరించిన డబ్బు రోడ్ల నిర్మాణానికి, కోవిడ్ వ్యాక్సిన్‌లకు నిధులు సమకూర్చడానికి, పేదలకు ఇళ్లను నిర్మించడానికి, ఇతర సామాజిక సంక్షేమ పథకాలకు వెళుతుందని పేర్కొంటూ కేంద్రం లెవీలను సమర్థిస్తుంది.
 

55

సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలతో ప్రభుత్వం చర్చిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కొద్దిరోజుల క్రితం పేర్కొన్న సంగతి తెలిసిందే. గమనించదగ్గ విషయం ఏమిటంటే, పెట్రోల్ రిటైల్ ధరలో దాదాపు 60 శాతం, డీజిల్ రిటైల్ ధరలో 54 శాతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పన్నులు ఉన్నాయి.

ప్రతిపక్షాల విషయానికొస్తే, ఇంధన ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో వారు ఇప్పటివరకు అసమర్థంగా ఉన్నారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నవంబర్‌లో 15 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో  టోకెనిజంగా అభివర్ణించారు. 

click me!

Recommended Stories