దీపావళికి ముందు సామాన్యులకు షాక్... మరోసారి పెరగనున్న వాటి ధరలు..

First Published Oct 28, 2021, 1:54 PM IST

 శ్రీరాముడు రావణుడిని ఓడించి  తిరిగి అయోధ్య(aayodhya)కు వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు అతనికి స్వాగతం పలికేందుకు నెయ్యి దీపాలు వెలిగించారు. ఆనాటి నుంచి దీపావళి పండగ రోజున దీపాలు వెలిగించే  సంప్రదాయం కొనసాగుతోందని, దీపావళి (diwali)రోజున ప్రతి హిందూ కుటుంబంలో ప్రతి ఇంట్లో అలంకరణలు, పూజలు, వంటకాలు చేసి పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి సామాన్యులకు మాత్రం ఈ పండుగ వేడుక నిరాశ పర్చవచ్చు.

జూలై నుండి ఎల్‌పి‌జి ధర 
దీపావళి కంటే ముందే ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలు పెరగనున్నాయి. సమాచారం ప్రకారం ఎల్‌పిజి విషయంలో తక్కువ ధరకు విక్రయించడం వల్ల వచ్చే నష్టం ప్రస్తుతం సిలిండర్‌కు రూ. 100కి చేరుకుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి చమురు కంపెనీలు ఎల్‌పి‌జి ధరలను మరోసారి పెంచనుంది. ఈ నెల అక్టోబర్ 6న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 పెరిగింది. ఈ ఏడాది జూలై నుంచి వంటింటి గ్యాస్ సిలిండర్ ధర రూ.90 పెరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఈ పెంపు తర్వాత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.884.50 నుంచి రూ.899.50కి పెరిగింది. నాన్-సబ్సిడీ సిలిండర్ ధర  ఐదు కేజీల సిలిండర్ ధర రూ.502కు పెరిగింది.  అలాగే అక్టోబర్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43.5 పెరిగింది. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1736.5కి పెరిగింది. అంతకుముందు రూ.1693గా ఉంది. 
 

 ఎల్‌పి‌జి ధర ఎంత పెరుగుతుంది
అయితే, సిలిండర్ల ధరను ఎంత పెరగనుంది అనేదానిపై  స్పష్టత లేదు. కానీ, ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న సామాన్యులకు ఈ పెరుగుదల మరింత భారం పెంచుతుందని రుజువు చేస్తుంది. ఎల్‌పీజీ సిలిండర్ల ధర ఎంత పెరుగుతుందనేది ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల ఎల్‌పిజి సిలిండర్ల అమ్మకంపై ప్రభుత్వానికి వచ్చే నష్టం పెరిగింది, ఇప్పుడు దానిని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  

click me!