వివిఐపి హైటెక్ విమానంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..

First Published Sep 23, 2021, 2:59 PM IST

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి అంతర్జాతీయ రాష్ట్ర సందర్శనాలకు వెళ్లే ఏజింగ్ 747 స్థానంలో ఎయిర్ ఇండియా వన్ అనే కస్టమ్ మేడ్ బోయింగ్ బి777 వి‌వి‌ఐపి విమానాన్ని  గత సంవత్సరం ప్రవేశపెట్టరు. 

బుధవారం 22 సెప్టెంబర్ 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు బయల్దేరారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షుడు కమలా హారిస్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మరికొందరు అగ్ర సి‌ఈ‌ఓలతో సమావేశం కానున్నారు. 

కోవిడ్ -19 మహమ్మారి  వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీకి ఇది రెండవ విదేశీ పర్యటన. ఇంతకుముందు ప్రధాని కొత్తగా ప్రవేశపెట్టిన బోయింగ్ 777 వివిఐపి విమానంలో మార్చి 2021 లో బంగ్లాదేశ్‌లోని ఢాకాని పర్యటించారు. వి‌వి‌ఐపి హైటెక్ విమానం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి: 

సెక్యూరిటి సిస్టం

ఎయిర్ ఇండియా వన్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్లలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీనిలో లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మీజర్స్ (LAIRCM)ను కూడా ఉంది, ఇది క్షిపణి ప్రమాదలను ఎదుర్కోగల సామర్థ్యంతో సొంత క్షిపణి రక్షణ వ్యవస్థ.
 

సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్లు

శత్రువుల రాడార్ సిగ్నల్స్ ని జామ్ చేసి సమీపంలోని క్షిపణుల దిశను మళ్లించగల సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్లు (SPS)కలిగి ఉన్న మొదటి భారతీయ విమానం ఇది. 


అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్
దీనికి అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ అమర్చచారు, అంటే హ్యాక్ గురికాకుండా గాలిలో ఆడియో అండ్ వీడియో కమ్యూనికేషన్ ఫంక్షన్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది.
 

కాన్ఫరెన్స్ రూమ్, మెడికల్ సెంటర్‌

ఈ విమానంలో కాన్ఫరెన్స్ రూమ్, వివిఐపి ప్రయాణీకుల కోసం క్యాబిన్, మెడికల్ సెంటర్‌తో పాటు ఇతర ప్రముఖులు, సిబ్బంది కొర్చోవడానికి సీట్‌లతో నిండి ఉంటుంది.
 

ఎగిరే పరిధి అండ్ పైలట్లు

ఎయిర్ ఇండియా వన్ జెట్ లో ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండానే ఇండియా నుంచి అమెరికాకు  డైరెక్ట్ వెళ్లగలదు. ఒకసారి ఇంధనం నింపిన తర్వాత ఈ విమానం 17 గంటల పాటు నిరంతరం ఎగురుతుంది. ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన పైలట్లు ఆపరేట్ చేస్తారు.

click me!