పెరిగిన బంగారం, వెండి ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు ఎంత పెరిగిందంటే ?

First Published Sep 23, 2021, 11:29 AM IST

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్స్ క్షీణించాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజి ( ఎం‌సి‌ఎక్స్) లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.6 శాతం తగ్గి రూ. 46,377 కి చేరుకుంది. మరో వైపు సిల్వర్ ఫ్యూచర్స్ ఒక శాతం క్షీణించింది. గత ఏడాది గరిష్ట స్థాయి నుండి పసిడి ధర 10 గ్రాములకు రూ. 56,200 నుండి ఇప్పటికీ రూ .9823 తగ్గింది. 

నిన్న బంగారం ఫ్లాట్‌గా ముగిసింది, వెండి 1.2 శాతం పెరిగింది. ఆగస్టులో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. దేశీయ డీలర్లు రాబోయే పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలు  ఉంటాయని భావిస్తున్నారు. 

స్పాట్ బంగారం 0.3 శాతం తగ్గి ఔన్సు కి 1,762.33 డాలర్లుగా ఉంది. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్టానికి దగ్గరగా ఉంది.

ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ నవంబర్‌లో ఆస్తుల కొనుగోళ్లను తగ్గించడం ప్రారంభించి, 2222 మధ్య నాటికి ప్రక్రియను పూర్తి చేయవచ్చని చెప్పారు. ఇతర విలువైన లోహాలలో, వెండి 0.3 శాతం తగ్గి ఔన్సు  22.60 డాలర్లకి పడిపోయింది, ప్లాటినం 994.84 డాలర్ల వద్ద ఉంది.

భారతదేశంలో బంగారం డిమాండ్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 19 శాతం పెరిగింది
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 19.2 శాతం పెరిగి 76.1 టన్నులకు చేరుకుంది. గత సంవత్సరం కరోనా వ్యాధిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయి. 2020 క్యాలెండర్ సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం బంగారం డిమాండ్ 63.8 టన్నులు అని  పేర్కొంది. నివేదిక ప్రకారం, భారతదేశంలో బంగారం డిమాండ్ విలువలో 23 శాతం పెరిగి రూ .32,810 కోట్లకు చేరుకుంది. 2020 ఇదే కాలంలో రూ .26,600 కోట్లుగా ఉంది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్నందున గత త్రైమాసికంతో పోలిస్తే డిమాండ్ 46 శాతం క్షీణించింది. ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధభాగంలో మొత్తం డిమాండ్ 157.6 టన్నులుగా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి కదిలి రూ.47,840కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా  రూ.350 పెరుగుదలతో రూ.43,850కు ఎగిసింది.

వెండి ధర కూడా భారీగా పెరిగింది.  దీంతో కేజీ వెండి ధర రూ.1300 ఎగిసి రూ.65,100కు చేరింది.  కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని గమనించాలి.
 

click me!