ప్రధాన మంత్రి ఉజ్వల యోజన: ఈ ప్రభుత్వ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి..

First Published Aug 10, 2021, 8:00 PM IST

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉజ్జ్వల యోజన (ప్రధాన మంత్రి ఉజ్వల యోజన - PMUY) రెండవ దశను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ఉజ్జ్వల పథకం లబ్ధిదారులతో కూడా మాట్లాడరు. 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అంటే ఏమిటి ?

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, ప్రభుత్వం పావర్టీ లైన్ దిగువన నివసిస్తున్న లబ్ధిదారులకు ఎల్‌పి‌జి కనెక్షన్లను అందిస్తుంది. మహిళలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే  దరఖాస్తు చేసుకున్న మహిళలు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఒక ఇంటిలో ఈ పథకం కింద ఏ ఇతర ఎల్‌పి‌జి కనెక్షన్ ఉండకూడదు.
 

ఉజ్జ్వాలా 1.0 నుండి ఉజ్వల 2.0 వరకు ప్రయాణం

2016లో ప్రారంభించిన ఉజ్వల యోజన 1.0 సమయంలో పావర్టీ లైన్ దిగువన నివసిస్తున్న ఐదు కోట్ల మంది మహిళలకు ఎల్‌పి‌జి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. తరువాత ఏప్రిల్ 2018లో ఈ పథకం కింద మరో ఏడు వర్గాల (ఎస్‌సి/ఎస్‌టి, పి‌ఎం‌ఏ‌వై, ఏ‌ఏ‌వై, అత్యంత వెనుకబడిన తరగతులు, టీ గార్డెన్, అటవీ నివాసులు, ద్వీపవాసులు) లబ్ధిదారులను చేర్చడానికి విస్తరించింది. అలాగే, దాని లక్ష్యం ఎనిమిది కోట్ల ఎల్‌పి‌జి కనెక్షన్‌లకు విస్తరించింది. ఈ లక్ష్యాన్ని గడువు తేదీకి ఏడు నెలల ముందు అంటే 2019 ఆగస్టులో సాధించారు.
 

పి‌ఎం‌యూ‌వై పథకం కింద ఒక కోటి అదనపు ఎల్‌పిజి కనెక్షన్‌లను 21-22 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఒక కోటి అదనపు పి‌ఎం‌యూ‌వై కనెక్షన్‌లు (ఉజ్వల 2.0 కింద) పి‌ఎం‌యూ‌వై మొదటి దశ కింద అందించలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు డిపాజిట్ రహిత ఎల్‌పి‌జి కనెక్షన్‌లను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఉజ్వల 2.0  ప్రయోజనం ఏమిటి?

ఉజ్వల 2.0 కింద, మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ లబ్ధిదారులకు డిపాజిట్ ఫ్రీ ఎల్‌పి‌జి కనెక్షన్‌తో పాటు ఉచితంగా అందించనున్నారు. 

అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి దీనికి వ్యక్తిగత సమాచారం అవసరం. ఉజ్వల 2.0 లో వలసదారులు రేషన్ కార్డులు లేదా నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.

'ఫ్యామిలీ డిక్లరేషన్' అండ్ 'రెసిడెన్స్ ప్రూఫ్' రెండింటికీ సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. 

ఉజ్వల యోజన 2.0 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు కూడా ఉజ్వల యోజన 2.0 కోసం దరఖాస్తు చేయాలనుకుంటే కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి- https://www.pmuy.gov.in/ 
ఆన్‌లైన్ అప్లికేషన్  ఆప్షన్ ఇక్కడ ఎంచుకోండి. 
ఇప్పుడు మీరు ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి. 
ఆ తర్వాత మీరు మీ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 
మీకు కావాలంటే మీరు ఇక్కడ నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అలాగే దాన్ని ఫిల్ చేసి మీ సమీప గ్యాస్ ఏజెన్సీ డీలర్‌కు సమర్పించవచ్చు.

click me!