MG Comet EV కారు
ఎంజీ ZS EV BaaS ఎలక్ట్రిక్ వాహనం ఇప్పుడు మీకు తక్కువ ధరలో లభిస్తుంది. కామెట్ EVతో పాటు కంపెనీ MG ZS EV ధరను కూడా తగ్గించింది. అయితే కంపెనీ BaaS పథకం(బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్) కింద ఈ వాహనాలను కొనుగోలు చేస్తేనే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. BaaS విధానంలో MG మోటార్స్ MG Windsor అనే ఎలక్ట్రిక్ మోడల్ ను విడుదల చేసింది. BaaS పథకం భారత దేశంలో విడుదలైన మొదటి కారు ఇది. ఇప్పుడు కామెట్ EV, MG ZS EVలకు కూడా BaaS పథకంలోకి తీసుకువచ్చింది. దీని వల్లనే ఈ రెండు కార్ల ధరలు తగ్గాయి.
mg zs ev రేంజ్
BaaS పథకం అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్. అంటే రెంట్(అద్దె) ఇచ్చి బ్యాటరీని తీసుకోవచ్చు. దీని వల్ల కార్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కస్టమర్ల కోసం BaaS పథకాన్ని ప్రారంభించింది.
mg మోటార్స్
బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ పథకంలో కంపెనీ బ్యాటరీ అద్దెకు అందుబాటులో ఉంటుంది. మీరు కిలోమీటరుకు ధర చెల్లిస్తే బ్యాటరీ తీసుకెళ్లవచ్చు. కామెట్ EV, ZS EV కోసం ప్రారంభించిన బ్యాటరీ అద్దె పథకంలో ఈ వాహనాల ధరలు భారీగా తగ్గాయి. MG మోటార్స్ కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కస్టమర్లు బ్యాటరీ మొత్తం ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కారు కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్లు కిలోమీటరుకు ఎంత ఖర్చు అవుతుందో, వారు ఎన్ని కిలో మీటర్లు తిరగాలి అనుకుంటున్నారో నిర్ణయించుకొని అంత వరకే డబ్బులు చెల్లిస్తే బ్యాటరీ రీఛార్జ్ చేసి ఇస్తారు.
mg కార్లు
MG కామెట్ EV ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు ఈ కారును బ్యాటరీ అద్దె ఎంపికతో కొనుగోలు చేస్తే ఈ ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.4.99 లక్షల ప్రారంభ ధరకు (షోరూమ్) కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు రూ.2 లక్షల మేర ప్రయోజనం చేకూరుతుంది. కారు కొనుగోలు చేసిన తర్వాత బ్యాటరీ అద్దెకు కిలోమీటరుకు రూ.2.5 చెల్లించాలి. మీరు ఎన్ని కిలో మీటర్లు తిరగాలనుకుంటున్నారో చెబితే సర్వీస్ సెంటర్ లో అంత రీఛార్జ్ చేసి బ్యాటరీ ఫిట్ చేసి ఇస్తారు. MG కామెట్ EV రేంజ్ విషయానికొస్తే ఈ కారు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
భారతదేశంలో mg ఎలక్ట్రిక్ కార్లు
MG బ్రాండ్ ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.18.98 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ అద్దె పథకంతో ఈ కారును కొనుగోలు చేస్తే ఈ కారును మీరు రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే వినియోగదారులకు సుమారు రూ.5 లక్షలు సేవ్ అవుతాయి. అయితే బ్యాటరీ అద్దె పథకం కింద ఈ కారుకు కిలోమీటరుకు రూ.4.5 చెల్లించాలి. MG ZS EV రేంజ్ విషయానికొస్తే ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.