Post Office: 5 ఏళ్లలో రూ. 2.5 లక్ష‌ల వ‌డ్డీ.. తెలివైన వారు చేసే ప‌ని ఇదే

Published : Jan 14, 2026, 12:44 PM IST

Post Office: ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి రిట‌ర్న్స్ రావాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో ర‌కాల ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఉన్నాయి. అలాంటి వాటిలో పోస్టాఫీస్ అందించే టైమ్ డిపాజిట్ స్కీం ఒక‌టి. 

PREV
15
పోస్టాఫీస్ పథకాలకు పెరుగుతోన్న ఆద‌ర‌ణ

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ విస్తరిస్తున్నప్పటికీ చాలామంది ఇప్పటికీ భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బు రిస్క్ లేకుండా పెరగాలి అనే ఆలోచన ఉన్నవారు పోస్టాఫీస్ పథకాలనే ఎంచుకుంటున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుల తర్వాత బ్యాంక్ ఎఫ్‌డీల ఆకర్షణ తగ్గినా, పోస్టాఫీస్ స్కీమ్స్ మాత్రం అదే స్థిరత్వంతో కొనసాగుతున్నాయి. అలాంటి బెస్ట్ స్కీమ్స్‌లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ప‌థ‌కం ఒక‌టి.

25
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం అంటే ఏంటి?

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం బ్యాంక్ ఎఫ్‌డీ తరహాలోనే ఉంటుంది. ఇందులో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి ఖాతా తెరవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి ఒకేసారి లభిస్తుంది. ఎలాంటి రిస్క్ ఉండదు, ముందే వడ్డీ రేటు ఫిక్స్ అవుతుంది.

35
ప్రస్తుత వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి?

ప్రస్తుతం పోస్టాఫీస్ టీడీ పథకంలో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

* 1 సంవత్సరం TD – 6.9 శాతం

* 2 సంవత్సరాల TD – 7.0 శాతం

* 3 సంవత్సరాల TD – 7.1 శాతం

* 5 సంవత్సరాల TD – 7.5 శాతం

ఈ రేట్లలో ఇటీవల ఎలాంటి మార్పులు చేయలేదు. అందుకే దీర్ఘకాల పెట్టుబడికి 5 సంవత్సరాల పథకం ఎక్కువగా ఉపయోగపడుతోంది.

45
రూ.5,00,000 డిపాజిట్ చేస్తే 5 ఏళ్లలో ఎంత వస్తుంది?

మీరు పోస్టాఫీసులో 5 సంవత్సరాల TD పథకంలో రూ.5,00,000 డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ. 7,24,975 అవుతుంది. కేవ‌లం వ‌డ్డీ రూపంలోనే రూ. 2,24,975 పొందొచ్చు. అంటే రిస్క్ లేకుండా, మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా ఐదేళ్లలోనే రూ.2.25 లక్షలకు దగ్గరగా వడ్డీ పొందుతారు. ఈ వడ్డీ పూర్తిగా స్థిరంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు.

55
ఈ పథకం ఎవరికెక్కువ లాభం?

ఈ పథకం అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది. స్థిర ఆదాయం కోరుకునేవారు, రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నవారు, రిస్క్ లేకుండా పొదుపు పెంచాలనుకునేవారికి ఈ స్కీమ్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై 7.5 శాతం వడ్డీ ఇవ్వడం లేదు అనే విషయం గమనించాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. పెట్టుబ‌డి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories