Saving scheme: ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తే.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. మీ డ‌బ్బుల‌కు ఫుల్ సెక్యూరిటీ

Published : Jul 28, 2025, 10:44 AM IST

సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో దానిని స‌రైన మార్గంలో ఇన్వెస్ట్ చేయ‌డం కూడా అంతే ముఖ్య‌ం. అందుకే డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టే ముందు  ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మ‌రి డ‌బ్బుకు భ‌ద్ర‌త‌తో పాటు మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్

ప్రభుత్వ హామీతో సురక్షితమైన పొదుపు మార్గం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లా ఇది కూడా ఫిక్స్‌డ్ వడ్డీ ఇస్తుంది. తక్కువ రిస్క్, పన్ను ప్రయోజనాలు కోరుకునే వారు ఎక్కువగా ఈ పథకాన్ని ఎంచుకుంటారు. అందులోనూ న‌చ్చిన కాల వ్య‌వ‌ధి వ‌ర‌కు అమౌంట్‌ను డిపాజిట్ చేసుకోవ‌చ్చు.

DID YOU KNOW ?
ప‌న్ను మిన‌హాయింపు కూడా
టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో మంచి వ‌డ్డీతో పాటు పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద, ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై పాత పన్ను విధానం ప్రకారం గరిష్టంగా ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
25
వ‌డ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.?

ఇటీవల పోస్టల్ డిపార్ట్‌మెంట్ TD స్కీమ్ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. వీటి ప్రకారం

1 సంవత్సరం: 6.9% (మార్పులేదు)

2 సంవత్సరాలు: 7% నుంచి 6.9%కి తగ్గింపు

3 సంవత్సరాలు: 7.1% నుంచి 6.9%కి తగ్గింపు

5 సంవత్సరాలు: 7.5% నుంచి 7.7%కి పెంపు

35
ఎంత పెట్టుబ‌డి పెట్టొచ్చు.?

ఈ ప‌థ‌కంలో క‌నీసం రూ. 1000 నుంచి పెట్టుబ‌డి పెట్టొచ్చు. గ‌రిష్ట ప‌రిమితి అంటూ ఏం లేదు. 1, 2, 3, 5 సంవత్సరాల టెన్యూర్ ఆప్షన్స్ ఉంటుంది. వడ్డీ త్రైమాసికంగా లెక్కించి సంవత్సరానికి చెల్లిస్తారు. ఈ అకౌంట్‌ను పర్సనల్, జాయింట్, మైనర్ అకౌంట్లుగా ఓపెన్ చేసుకోవ‌చ్చు. అకౌంట్‌ను మరో పోస్టాఫీసుకు ట్రాన్స్‌ఫర్ చేసే సౌకర్యం కూడా ఉంది. 5 సంవత్సరాల TDపై 80C పన్ను మినహాయింపు పొందొచ్చు.

45
రూ. ల‌క్ష పెట్టుబ‌డి పెడితే ఎంత వ‌స్తుందంటే.?

ఒక‌వేళ మీరు ఈ ప‌థ‌కంలో రూ. 100000 పెట్టుబ‌డి పెడితే. ఏ ఏడాదికి ఎంత అమౌంట్ వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 సంవత్సరం: రూ. 1,06,9975

2 సంవత్సరాలు: రూ. 1,14,162

3 సంవత్సరాలు: రూ. 1,21,558

5 సంవత్సరాలు: రూ. 1,38,570 వ‌స్తుంది.

55
రూ.5 లక్షల పెట్టుబడితే.. రూ. 2 ల‌క్ష‌ల వ‌డ్డీ

ఒక‌వేళ మీరు ఈ ప‌థ‌కంలో రూ. 5 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెడితే.. ఏ ఏడాదికి ఎంత అమౌంట్ వ‌స్తుందో ఇప్పుడు చూద్దాం.

1 సంవత్సరం: రూ. 5,34,877

2 సంవత్సరాలు: రూ. 5,70,806

3 సంవత్సరాలు: రూ. 6,07,790

5 సంవత్సరాలు: రూ. 1,92,840 పొందొచ్చు.

అంటే లాభం (వడ్డీ రూపంలో): రూ. 1,92,840 (దాదాపు రూ.2 లక్షలు) అన్న‌మాట‌. అంటే బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ రాబడి వస్తుంది. పన్ను మినహాయింపు సదుపాయం మ‌రో బెనిఫిట్‌గా చెప్పొచ్చు.

పూర్తి వివరాల కోసం మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించండి. 

Read more Photos on
click me!

Recommended Stories