Financial Planning Tips: అప్పు భారమా.. ఆస్తా? ఆర్థికంగా ఎదగాలంటే అప్పును ఎలా వాడుకోవాలి?

Published : Jul 28, 2025, 10:34 AM IST

అప్పు అనగానే చాలామంది భయపడుతుంటారు. నిజానికి అప్పు.. దాని వినియోగాన్ని బట్టి ఆస్తిగా లేదా భారంగా మారుతుంది. సంపదను పెంచుకోవడానికి అప్పును ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ చూద్దాం.   

PREV
15
అప్పు భారమా? లేక ఆస్తా?

ప్రతి ఒక్కరికీ డబ్బు కావాలి. నిజానికి మన అందరి జీవితాలను నడిపించేది, శాసించేది డబ్బే. అవసరాల కోసం, ఆశయాల కోసం, ఎదుగుదల కోసం మనం అప్పు తీసుకోవడం సహజం. కానీ అప్పు తీసుకోవడమే లక్ష్యంగా మారితే, అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అసలు అప్పు భారమా లేక ఆస్తా? ఎలా ఉపయోగిస్తే అప్పు ఆస్తిగా మారుతుందో ఇక్కడ చూద్దాం.  

25
ఇలా చేస్తే అప్పు భారం కాదు!

అప్పు ఎప్పుడూ భారం కాదు. దాని వినియోగం ముఖ్యం. ఆదాయం లేని ఖర్చులకు అప్పు తీసుకోవడం మంచిదికాదు. సరైన కారణం కోసం, సరైన ప్రణాళికతో తీసుకుంటే అప్పు అండగా నిలుస్తుంది.

ఒక వ్యక్తి చదువు కోసం రుణం తీసుకొని చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం పొందడం ద్వారా జీవితాన్నే మార్చుకోవచ్చు. అలాగే వ్యాపారంలో పెట్టుబడి కోసం తీసుకున్న అప్పుల వల్ల లాభాలు పొందవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అప్పు అనేది భవిష్యత్‌ను నిర్మించే సాధనంగా ఉపయోగపడుతుంది.

35
అదుపు లేకుంటే అప్పు భారమే!

కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకోవడం భారంగా మారవచ్చు. ముఖ్యంగా ప్రణాళిక లేకుండా తీసుకునే వ్యక్తిగత రుణాలు, హంగులు, ఆర్భాటాల కోసం చేసే అప్పులు, క్రెడిట్ కార్డు బకాయిల వంటివి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి. వాటిని తిరిగి చెల్లించేందుకు జీవితకాలం గడిచిపోతుంది. 

అంతేకాదు అప్పు.. మనశ్శాంతి, సుఖం అన్నింటినీ దూరం చేస్తుంది. చాలామంది ఒక్కసారి అప్పు చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు. ఇది కుటుంబ బంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అప్పు కచ్చితంగా భారం అవుతుంది. 

45
ఆర్థిక ఎదుగుదలకు అప్పును ఎలా ఉపయోగించాలి?

-  అవసరాన్ని అంచనా వేయాలి. అప్పు అవసరమా? లేదా తక్షణ అవసరమా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

- ప్రణాళికతో ముందడుగు వేయాలి. ఎంత తీసుకుంటున్నాం? ఎప్పుడు తిరిగి చెల్లించగలం? వంటివి ముందుగానే అంచనా వేసుకోవాలి.

-  అప్పును.. ఆదాయాన్ని పెంచే దిశలో వినియోగించాలి. అప్పు వల్ల ఆస్తి రూపంలో ఫలితం రావాలంటే దాన్ని ఆదాయ సాధనంగా మార్చుకోవాలి.

- దుర్వినియోగం నివారించాలి. అవసరం లేని ఖర్చుల కోసం అప్పు పొరపాటున కూడా చేయద్దు.

55
ఫైనల్ గా..

అప్పు ఆస్తిగా మారడానికి మన దృష్టికోణం, వినియోగం, ప్రణాళిక ముఖ్యమైనవి. అదుపులో ఉన్న అప్పు సాధనం వంటిది. అదుపు తప్పిన అప్పు శాపం లాంటిది. దాన్ని ఎలా ఉపయోగిస్తామో దాని మీదే దాని స్వరూపం ఆధారపడి ఉంటుంది. అప్పును ఆస్తిగా మార్చుకోవాలా? భారంగా మార్చుకోవాలా? అనేది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories