Post Office Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు 20 వేల ఆదాయం.. పోస్టాఫీసు సూపర్ సేవింగ్ స్కీమ్

Published : Oct 20, 2026, 02:52 PM IST

Post Office Scheme: రిటైర్‌మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఆందోళన లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ప్రభుత్వ భద్రతతో కూడిన పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక అద్భుతమైన వరం. ఈ పథకంతో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

PREV
15
పోస్ట్ ఆఫీస్ సూపర్‌హిట్ స్కీమ్.. మీ భవిష్యత్తుకు పూర్తి గ్యారెంటీ

ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్ పొందిన తర్వాత ప్రతినెల క్రమం తప్పకుండా ఆదాయం రావడం అనేది చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు సరైన పొదుపు పథకాన్ని ఎంచుకోవడం ఎంతో అవసరం. ఇటువంటి పరిస్థితిలో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) సీనియర్ సిటిజన్లకు ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది.

ఈ ప్రభుత్వ పొదుపు పథకంలో గరిష్ఠంగా రూ. 30 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా సంవత్సరానికి రూ. 2.46 లక్షల వరకు వడ్డీని పొందవచ్చు. అంటే నెలకు సగటున రూ. 20,500 వరకు రాబడి లభిస్తుంది. అయితే ఈ వడ్డీ డబ్బులు ప్రతి నెలా కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఖాతాలో జమ అవుతాయి.

25
8.2 శాతం వడ్డీ రేటు, మార్కెట్ రిస్క్ లేని భద్రత

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రత్యేకంగా రిటైర్‌మెంట్ తర్వాత క్రమబద్ధమైన రాబడిని అందించడానికి రూపొందించారు. ప్రస్తుతం ఈ పథకంలో పొదుపు చేసే వారికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. మీరు ఖాతా తెరిచే సమయంలో ఉన్న వడ్డీ రేటు ఆధారంగానే మీకు రాబోయే రాబడి ఖరారవుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకం కావడం వల్ల ఇందులో షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే ఎలాంటి రిస్క్ ఉండదు. మీ పెట్టుబడికి పూర్తి భద్రత, గ్యారెంటీ లభిస్తుంది.

35
ఈ పథకంలో ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు?

సాధారణంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. అయితే కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో రిటైర్ అయిన వారు కూడా ఇందులో చేరవచ్చు.

అలాగే రిటైర్ అయిన డిఫెన్స్ సిబ్బంది 50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా ఈ ఖాతాను తెరిచే సదుపాయం ఉంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి తన పేరు మీద ఈ పథకంలో గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

45
రూ. 30 లక్షల డిపాజిట్‌పై రాబడి వివరాలు ఇవే

ఒక వేళ ఒక ఇన్వెస్టర్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో రూ. 30 లక్షల పూర్తి పరిమితిని డిపాజిట్ చేసి, ఏడాదికి 8.2 శాతం వడ్డీ పొందితే లెక్కలు ఈ విధంగా ఉంటాయి..

• మొత్తం పెట్టుబడి: రూ. 30,00,000

• సంవత్సరానికి వచ్చే వడ్డీ: రూ. 2,46,000

• ప్రతి మూడు నెలలకు వచ్చే వడ్డీ: రూ. 61,500

• నెలకు సగటున వచ్చే రాబడి: రూ. 20,500

ఈ లెక్క ప్రకారం ఖాతాదారుడికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 61,500 వడ్డీ రూపంలో నేరుగా లభిస్తుంది.

55
మెచ్యూరిటీ టైమ్, అదనపు పొడిగింపు సదుపాయం

ఈ పథకం ఐదేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత, నిబంధనల ప్రకారం మీ అసలు పెట్టుబడి మొత్తం మీకు తిరిగి లభిస్తుంది. ఒకవేళ అర్హులైన ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని మరింత కాలం కొనసాగించాలనుకుంటే, నిర్ణీత నిబంధనలు, షరతులకు లోబడి ఖాతాను మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories