Post Office Scheme: పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రూ. 5 లక్షల వరకు లాభం

Published : Jul 03, 2026, 11:52 AM IST

Post Office Scheme: పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ పెట్టుబడిపై అద్భుతమైన వడ్డీని పొందవచ్చు. సురక్షితమైన ఈ ప్రభుత్వ పథకంతో రూ. 5 లక్షలకు పైగా లాభం పొందే అవకాశం ఉంది. ఈ సూపర్ పోస్టాఫీస్ స్కీమ్ వివరాలు మీకోసం.

PREV
15
పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. ఒక్కసారి పెట్టుబడితో లాభాల పంట

పోస్టాఫీస్ ద్వారా నిర్వహించే ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి రాబడుల కారణంగా ఇన్వెస్టర్లలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాయి. మీరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ ప్రభుత్వ పథకాలు మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా 'పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్'లో ఒకసారి ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ రూపంలోనే రూ. 5 లక్షలకు పైగా సంపాదించే ఛాన్స్ ఉంది.

25
పోస్టాఫీస్ స్కీమ్.. పెట్టుబడికి పూర్తి భద్రత

పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం భద్రత. ఇందులో పెట్టే ప్రతి రూపాయికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి మీ డబ్బు పోతుందనే భయం అస్సలు లేదు. మార్కెట్ రిస్క్ ఉండదు కాబట్టి, చిన్న పెట్టుబడులను కూడా పెద్ద ఫండ్స్‌గా మార్చుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. ప్రభుత్వ పథకం కాబట్టి క్రమబద్ధమైన ఆదాయానికి కూడా ఇది హామీ ఇస్తుంది.

35
టైమ్ డిపాజిట్‌పై ఆకర్షణీయమైన వడ్డీ

పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు భద్రతలోనే కాదు, రాబడుల విషయంలోనూ ముందుంటాయి. టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఏడాదికి రూ. 7.5 లక్షల వరకు గరిష్ఠ వడ్డీని పొందే అవకాశం ఉంది. మీరు ఎంచుకున్న కాలపరిమితిని బట్టి ఈ వడ్డీ మారుతూ ఉంటుంది. ఇది 'వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్' ప్లాన్, అంటే ఒకేసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది.

ఈ స్కీమ్‌లో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన సమయాన్ని ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

• 1 సంవత్సరం: 6.9% వడ్డీ

• 2 సంవత్సరాలు: 7.0% వడ్డీ

• 3 సంవత్సరాలు: 7.1% వడ్డీ

• 5 సంవత్సరాలు: 7.5% వడ్డీ ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా 1, 2, 3 లేదా 5 ఏళ్ల కాలానికి ఒకేసారి డబ్బును డిపాజిట్ చేయవచ్చు.

45
వడ్డీతో రూ. 5 లక్షల లాభం ఎలా?

ఈ ప్రభుత్వ స్కీమ్ ద్వారా రూ. 5 లక్షలకు పైగా లాభం పొందడం చాలా సులభం. మీరు గరిష్ఠంగా 5 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఉదాహరణకు, మీరు రూ. 12 లక్షలను 5 ఏళ్ల పాటు ఈ పథకంలో ఉంచితే, 7.5 శాతం వడ్డీ రేటుతో మీ మొత్తం ఫండ్ రూ. 17,39,938 అవుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీకు రూ. 5,39,938 లాభం వస్తుంది. ఇక తక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, రూ. 4.5 లక్షలను 5 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 6,52,477 అందుతాయి. ఇందులో వడ్డీ లాభం రూ. 2,02,477 ఉంటుంది.

55
కాలపరిమితిని బట్టి అదనపు ప్రయోజనాలు

మీరు 3 ఏళ్ల కాలపరిమితితో రూ. 2 లక్షల లాభం పొందాలని అనుకుంటే, రూ. 10 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 7.1 శాతం వడ్డీ రేటు లెక్కన 3 ఏళ్ల తర్వాత మీ మొత్తం ఫండ్ రూ. 12,35,075 అవుతుంది. దీనిలో రూ. 2,35,075 కేవలం వడ్డీ ద్వారానే వచ్చిన లాభం. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టుగా కాలపరిమితిని ఎంచుకుని పట్టుబడులు పెట్టడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories