Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు

Published : Dec 16, 2025, 05:36 PM IST

Post office: మారిన ఆర్థిక ప‌రిస్థితులతో చాలా మందిలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెరిగింది. పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ ఒక అదిరిపోయే సేవింగ్ స్కీమ్‌ను అందిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
నెల‌వారీ పొదుపు

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం పొదుపు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఖర్చులు పెరుగుతున్న వేళ భద్రమైన పెట్టుబడి మార్గాలు అవసరమవుతున్నాయి. ఈ అవసరానికి తపాలా శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం మంచి ఎంపికగా మారింది. చిన్న మొత్తంతో ప్రారంభించి పెద్ద మొత్తాన్ని పొందే అవకాశం ఇందులో ఉంటుంది.

25
పోస్టాఫీస్‌ ఆర్‌డీ పథకం ప్రత్యేకత

భారత ప్రభుత్వ తపాలా శాఖ అమలు చేస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం పూర్తిగా సెక్యూర్‌. ఈ పథకంలో పెట్టిన డబ్బుకు ప్రస్తుతం ఏడాదికి 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. నెలవారీగా డిపాజిట్ చేసే విధానం కావడంతో సామాన్యులకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

35
రోజుకు రూ.222 పెట్టుబడితే..

ఈ ఆర్‌డీ పథకంలో రోజుకు రూ.222 పెట్టుబడి పెడితే నెలకు రూ.6,660 అవుతుంది. ఒక సంవత్సరం మొత్తంగా చూస్తే రూ.79,920 పెట్టుబడి చేసినట్టవుతుంది. ఈ విధంగా ఐదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగిస్తే మొత్తం డిపాజిట్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది.

45
5 సంవత్సరాల పెట్టుబడికి వచ్చే మొత్తం

రోజుకు రూ.222 చొప్పున ఐదేళ్లు పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం డిపాజిట్ సుమారు రూ.3,99,600 అవుతుంది. ఈ కాలానికి వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.4,75,297 అందుతుంది. చిన్న మొత్తంతో మొదలై మంచి రాబడి అందించే పథకం ఇది.

55
10 సంవత్సరాల పెట్టుబడితో రూ.11 లక్షలకు పైగా

ఈ పెట్టుబడిని పదేళ్ల పాటు కొనసాగిస్తే ఫలితం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పదేళ్లలో మొత్తం పెట్టుబడి రూ.7,99,200 అవుతుంది. వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.11,37,981 అందుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే రూ.3,38,781 లభిస్తుంది. దీర్ఘకాల పొదుపు చేయాల‌నుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories