Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్

Published : Dec 15, 2025, 11:19 AM IST

Govt Employees Arrears: ఎనిమిదో వేతన సంఘం అమలులోకి వచ్చాక జీతం, పెన్షన్ 30 నుంచి 34 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే వారికి లక్షల రూపాయల బకాయిలు అంటే ఎరియర్స్ కూడా అందే అవకాశం ఉంది. ఇవి త్వరలోనే వారి చేతికందనున్నాయి.

PREV
14
ఎనిమిదో వేతన సంఘం వస్తే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎనిమిదో వేతనం సంఘం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వేగంగా చర్యలు  8వ వేతన సంఘంపై చర్చ నడుస్తోంది. ఇది 2028లో అమలయ్యే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆ సమయానికి లక్షల్లో ఎరియర్స్ రావచ్చని అంచన వేసుకుంటున్నారు ఉద్యోగులు. 

24
జీతం ఎంత పెరుగుతుంది?

ఎనిమిదో వేతన సంఘం రిపోర్టు రావడానికి మరో 18 నెలల సమయం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదానికి మూడు నుంచి ఆరు నెలలు పట్టొచ్చు.  అంటే ఇది 2028 ప్రారంభంలో ఇది అమల్లోకి రావచ్చు. దీని వల్ల జీతం లేదా పెన్షన్ 30 నుంచి 34 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా అయితే జీతం కొంతమందికి దాదాపు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.  7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. 8వ వేతన సంఘంలో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 నుంచి 3.0 వరకు ఉండవచ్చని అంచనా. డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటివి కూడా పెరుగుతాయి.

34
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

జీతం ఎంత పెరుగుతుందో అంచనా వేయవచ్చు. లెవల్-1 ఉద్యోగి జీతం రూ.35,000 నుంచి రూ.46,900కి పెరగొచ్చు. 2026 జనవరి నుంచి లెక్కిస్తే  24 నెలల బకాయిలు రూ.2.85 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అందే అవకాశం ఉంది. ఇక పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ బకాయిలు పదిహేను లక్షల రూపాయలు దాటి ఉంటే అవకాశం ఉంది. 

44
ప్రతి పదేళ్లకు ఒకసారి

సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన సంఘం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే లెక్కన చూస్తే 8వ వేతన సంఘం 2026 ప్రాంతంలో రావాల్సి ఉంటుంది. గత వేతన సంఘాల విధానాన్ని పరిశీలిస్తే, అమలుకు ముందు కనీసం ఏడాది నుంచి రెండేళ్ల ముందే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎనిమిదో వేతన సంఘంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories