పెట్టుబడి పెట్టడం ఎలాగంటే..
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద కనీసం 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా సంవత్సరానికి 6.70 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం కూడా ఉంది.
ఉదాహరణకు ఈ పథకం కింద మీరు నెలకు రూ.500 పెట్టుబడి పెట్టి ఖాతాను ప్రారంభించారు అనుకుందాం. ప్రతి నెలా రూ.500 చొప్పున కట్టాలి. ఇలా 5 సంవత్సరాలు కడితే రూ.30000 పెట్టుబడి అవుతుంది. ఈ మొత్తానికి మీకు సంవత్సరానికి 6.70 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో మీరు అయిదేళ్ల తర్వాత రూ.35,681 పొందుతారు.
అదే విధంగా మీరు నెలకు రూ.1000 పెట్టుబడి పెట్టి ఖాతాను ప్రారంభించి 5 సంవత్సరాలు కడితే రూ.60000 డిపాజిట్ చేస్తారు. స్థిర వడ్డీ రేటు ద్వారా మీరు అయిదేళ్ల తర్వాత రూ.71,369 పొందుతారు. అదే మీరు నెలకు రూ.700 పెట్టుబడి పెడితే వడ్డీతో సహా రూ.49,955 పొందుతారు.