కారు విండోస్, సన్‌రూఫ్ మూసివేయండి
బాణసంచా నిప్పురవ్వలు కారు లోపలికి రాకుండా ఉండటానికి అన్ని విండోస్ క్లోజ్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. సన్‌రూఫ్ ఉంటే అవి కూడా పూర్తిగా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. పొరపాటున నిప్పురవ్వలు కారు లోపల పడితే కారు పూర్తిగా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. సీట్ల వల్ల మంటలు వేగంగా విస్తరిస్తాయి. అందువల్ల విండోస్, సన్ రూఫ్ సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం.
ఫైర్ రెసిస్టెంట్ వస్తువులు సిద్ధంగా ఉంచుకోండి.
మీ వాహనంలో ఒక చిన్న ఫైర్ రెసిస్టెంట్ పరికరాన్ని ఉంచుకోవడం ఒక అద్భుతమైన భద్రతా చర్య అవుతుంది. అత్యవసర పరిస్థితిలో నిప్పురవ్వలు లేదా చిన్న మంటలను ఇవి త్వరగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా వీటిని ఎలా ఉపయోగించాలో మీరు ముందే తెలుసుకొని ఉండటం చాలా అవసరం.