Post Office: నెల‌కు రూ. 12500 పొదుపు చేస్తే.. రూ. 40 ల‌క్ష‌లు మీ సొంతం

Published : Dec 25, 2025, 01:37 PM IST

Post Office: ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే ప‌థ‌కాల వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన పోస్టాఫీస్‌లో మంచి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

భద్రమైన పెట్టుబడి కావాలనుకునే వారికి పోస్టాఫీస్ అందించే పథకాలు బెస్ట్ ఆప్ష‌న్స్‌గా నిలుస్తున్నాయి. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం చాలా మందికి నమ్మకమైన దీర్ఘకాలిక సేవింగ్స్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ప్రభుత్వ హామీ ఉండటంతో పాటు పన్ను ప్రయోజనాలు ఉండటం దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు.

25
పీపీఎఫ్ పథకం ప్రత్యేకతలు

పీపీఎఫ్ పథకంపై ప్రస్తుతం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో పెట్టే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం… ఈ మూడు అంశాలపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది చాలా అరుదైన ప్రయోజనం. అందుకే పీపీఎఫ్‌ను ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడుల్లో బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తారు.

35
15 ఏళ్లలో ఎంత డబ్బు వస్తుంది?

ఒక వ్యక్తి ప్రతి నెల రూ.12,500 చొప్పున పెట్టుబడి పెడితే, ఏడాదికి రూ.1.5 లక్షలు అవుతాయి. ఇదే పీపీఎఫ్‌లో గరిష్టంగా అనుమతించే పెట్టుబడి పరిమితి. ఈ విధంగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు అవుతుంది. వడ్డీ రూపంలో సుమారు రూ.18.18 లక్షలు వస్తాయి. చివరకు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.40.68 లక్షల కార్పస్ లభిస్తుంది.

45
తక్కువ ఆదాయం ఉన్నవారికీ అవకాశం

పీపీఎఫ్ ఖాతాను కేవలం రూ.500తో కూడా ప్రారంభించవచ్చు. అందువల్ల తక్కువ ఆదాయం ఉన్నవారికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. లాక్-ఇన్ కాలం 15 సంవత్సరాలు కావడంతో దీర్ఘకాలిక సేవింగ్స్ అలవాటు పెరుగుతుంది. ఐదేళ్లు పూర్తయ్యాక కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆర్థిక సంవత్సరం పూర్తైన తరువాత లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

55
మార్కెట్ ఊగిసలాటలో భద్రమైన ఎంపిక

షేర్ మార్కెట్ వంటి పెట్టుబడుల్లో లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నా రిస్క్ కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ఉన్న పీపీఎఫ్ లాంటి పథకాలు భద్రమైన మార్గంగా నిలుస్తాయి. స్థిరమైన వడ్డీ, పన్ను ప్రయోజనాలు, గ్యారంటీ రాబడి కావాలనుకునే వారికి పీపీఎఫ్ మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం మీకు స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను సంద‌ర్శించండి.

గమనిక: పై సమాచారం సాధారణ అవగాహన కోసమే. పెట్టుబడి నిర్ణయాల ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories